అత్యంత భారీ సినిమాలను తీయడమే కాకుండా ఆ సినిమాలను మార్కెట్ చేయడంలో రాజమౌళికి ఉన్న తెలివితేటలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరి ఏటాప్ డైరెక్టర్ కు లేవు అన్నది వాస్తవం. ‘బాహుబలి’ ప్రాజెక్టు రికార్డులు క్రియేట్ చేయడం వెనుక రాజమౌళి కృషితో పాటు బాలీవుడ్ లో ఈసినిమా ఘన విజయం వెనుక కరణ్ జోహార్ వ్యూహాలు ఎంతగానో సహకరించాయి. 

అయితే ‘బాహుబలి’ తరువాత కరణ్ జోహార్ రాజమౌళిల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాసింది. దీనికి బలం చేకూర్చే విధంగా రాజమౌళి కరణ్ జోహార్ లు ఈమధ్య కాలంలో ఎక్కడా కలిసి కనిపించకపోవడంతో ఈ వార్తలు నిజమే అనుకున్నారు అంతా.
SS Rajamouli. File Photo/News 18
అయితే అందరి ఊహాలను తలక్రిందులు చేస్తూ తిరిగి రాజమౌళి కరణ్ జోహార్ లు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో మళ్ళీ జత కట్టబోతున్నారు. అంతేకాదు రాజమౌళి ఈ మధ్య కరణ్ జోహార్ లు కలిసి తాను తీయబోతున్న చరణ్ జూనియర్ ల మల్టీ స్టారర్ కథ విషయంలో తనకు ఏర్పడిన కొన్ని సందేహాలకు సంబంధించి కరణ్ జోహార్ సూచనలు కూడ తీసుకున్నట్లు టాక్. 
 S.S. Rajamouli
రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని బాలీవుడ్ లో ప్రమోట్ చేసే విషయంలో కరణ్ జోహార్ తన పూర్తి సహాయ సహకారాలను రాజమౌళికి అందిస్తాను అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న రాజమౌళి మల్టీ స్టారర్ కు ఇక ఎటువంటి మార్కెట్ సమస్యలు ఉండవు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటిదాకా కొంచం దూరం జరిగిన కరణ్ జోహార్ ను తిరిగి తన గ్రిప్ లోకి తెచ్చుకునే విషయంలో రాజమౌళి అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే జక్కన్న మైండ్ గేమ్ కు ఎలాంటి వ్యక్తి అయినా పడిపోతాడు అన్నది నిజం..


మరింత సమాచారం తెలుసుకోండి: