అనుపమా పరమేస్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ మూవీ షూటింగ్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అనుపమా పరమేశ్వరన్ ల మధ్య చిన్న ఘర్షణ జరిగిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈవార్తలను అనుపమ ఖండించి తన ట్విటర్ లో ప్రకాష్ రాజ్ తో నవ్వుతూ కలిసి తీయించుకున్న ఫోటోను అందరికీ షేర్ చేసి ఈవివాదానికి ముగింపు పలకడానికి తన వంతు ప్రయత్నాలను చేసింది.
Words of War Between Prakash Raj and Anupama Parameswaran
అయితే ఈవివాదం విషయమై ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ‘హలో గురు ప్రేమకోసమే’ షూటింగ్ స్పాట్ లో ఒక సీన్ విషయంలో అనుపమ ప్రకాష్ రాజ్ తో కలిసి నటిస్తున్నప్పుడు ఆమె సరిగ్గా నాటించలేకపోవడంతో ప్రకాష్ రాజ్ అన్న మాటలకు ఆమె తీవ్రంగా ఏడుస్తూ సెట్లో పడిపోయిన నేపధ్యంలో ఆమెను దగ్గరలో ఉన్న హాస్పటల్ కు తీసుకువెళ్ళి వైద్యం చేయించవలసి వచ్చిందని ఆ షాక్ కు అనుపమ కోలుకోవడానికి రెండు రోజులు పట్టడంతో ఈమూవీ షూటింగ్ రెండురోజులు ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఆఆంగ్ల దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
Rumors About Anupama Parameswaran And Prakash raj Is Fake - Sakshi
అయితే ఈవిషయమై ఈమూవీ దర్శకుడు నక్కిన త్రినాథ రావు మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులతో నటించేడప్పుడు ప్రకాష్ రాజ్ తన సహ నటీనటులకు సూచనలు ఇవ్వడం సర్వసాధారణం అనీ ఈచిన్న విషయాన్ని అర్ధం చేసుకోలేక అనుపమ అనవసరంగా ఖంగారు పడింది అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు అనుపమ ఈమూవీ సెట్ పై కొలాప్స్ కావడానికి ప్రకాష్ రాజ్ మాటలు కారణం కాదని ఆమెకు ఏర్పడిన ఒకచిన్న ఆరోగ్య సమస్య  అని అంటున్నాడు. 

అంతేకాదు ఈ సంఘటన తరువాత అనుపమ ప్రకాష్ రాజ్ లు కలిసి నటించిన చాల సన్నివేశాలలో వారు ఎంతో అభిమానంతో నటించారు అని అంటూ ఇలాంటి విషయాలు ఇండస్ట్రీలో సర్వసాధారణం అని అంటున్నాడు. దీనితో ప్రకాష్ రాజ్ మాటలకు అనుపమ నొచ్చుకుంది అని వస్తున్న వార్తలకు ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: