ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు.   ఇప్పటికే తెలుగు లో మహానటి, బాలీవుడ్ లో సంజు మంచి విజయాలు అందుకున్నాయి. బాలీవుడ్ లో సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా చేసుకొని తీసిన ‘సంజు’కలెక్షన్ల రికార్డు సృష్టిస్తుంది.   ఇక తెలుగు లో వచ్చిన ‘మహానటి’ చిత్రం కూడా అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువే కలెక్షన్లు దాటింది.  మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటనకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రశంసల జల్లులు కురిపించారు.  ప్రస్తుతం మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. 

ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో బాలకృష్ణ విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారట. ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇతర పాత్రలు ఇంకా తెలియాల్సి ఉంది.  అయితే ఎన్టీఆర్ బయోపిక్ కు ముగ్గురు నిర్మాతలు. అయితే బ్యానర్ మాత్రం హీరో బాలయ్య కొత్తగా స్టార్ట్ చేసినదే. మిగిలిన ఇద్దరు నిర్మాతలు, సాయి కొర్రపాటి, విష్ణు ఇద్దరూ సహనిర్మాతలుగా వ్యవహారిస్తారు.  సినిమా నిర్మాణ వ్యయం తాత్కాలికంగా యాభై కోట్లుగా డిసైడ్ చేసారు. 
Image result for ntr biopic
అయితే అసలు ఎవరి వాటా ఎంత? ఇనీషియల్ గా ఎంత పెట్టుబడి పెడుతున్నారు అన్నది కాస్త ఆసక్తికరమే. సినిమా నిర్మాణ వ్యయం తాత్కాలికంగా యాభై కోట్లుగా డిసైడ్ చేసారు. ఇందులో సగం మొత్తం బాలయ్య పెట్టుబడిగా పెడతారు. సినిమా లాభ నష్టాల్లో ఆయన వాటా సగం అన్నమాట.  మిగిలిన ఇద్దరు నిర్మాతలు, చెరో పావలావాటా పెడతారు. అంటే చెరో 12.5 కోట్లు అన్నమాట.ముందుగా ముగ్గురు కలిసి 12 కోట్ల వరకు పూల్ చేసి వర్క్ బిగిన్ చేసారు.  ఒకవేళ సినిమా బడ్జెట్ యాభైకోట్లు దాటితే.. మళ్లీ ముగ్గురూ పైన అనుకున్న రేషియోలో భరిస్తారు. సంక్రాంతి విడుదల చేయాలని క్రిష్ అన్నీ బాధ్యతలు తనపై వేసుకున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: