రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మొదటి రెండు పార్టులు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే 2000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా బాహుబలి రికార్డు సృష్టించింది. ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలతో వచ్చిన బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది.


ఇక ఈ సినిమా హిందిలో అంత పెద్ద విజయం అందుకోడానికి కరణ్ జోహార్ ముఖ్య పాత్ర వహించారు. సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని అందించి బాహుబలి సక్సెస్ లో ఆయన కూడా ఓ బాధ్యుడిగా నిలిచాడు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ లో రాబోతుందని తెలిసిందే. 


సినిమా ఎనౌన్స్ మెంటునే క్రేజీగా హ్యాష్ ట్యాగ్ ట్రిపుల్ ఆర్ అంటూ ఊరించేసిన జక్కన్న మెగా నందమూరి మల్టీస్టారర్ గా ఆ సినిమా మరో సంచలనంగా మారనుందని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా మొదట 150 కోట్ల బడ్జెట్ అనుకోగా కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే నిర్మించాలని చూశారు. కాని ఇప్పుడు ఆ సినిమా కూడా బాహుబలిలా హిందిలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.


అందుకే మళ్లీ రాజమౌళి కరణ్ జోహార్ తో డీల్ కుదుర్చుకుంటున్నాడట. హిందిలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా బడ్జెట్ డబుల్ అయ్యిందని అంటున్నారు. మొత్తానికి రాజమౌళి సినిమా అంటే పాన్ ఇండియా మూవీగా క్రేజ్ తెచ్చుకుంది. బాహుబలి తర్వాత ఈ ట్రిపుల్ ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని ప్రతి ఒక్క సిని అభిమానికి ఎక్సైటింగ్ గా ఉంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: