టాలీవుడ్ లో హీరో విశాల్‌ కి మంచి క్రేజ్ ఉంది.  పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన విశాల్ ఆ తర్వాత తమిళంలో నటించిన ప్రతి సినిమా తెలుగు లో డబ్ చేస్తూ వస్తున్నాడు. ఈ మద్య డిటెక్టివ్‌ విభిన్న కథతో తెరకెక్కడం, అది   విజయవంతం కావడంతో అభిమన్యుడు సినిమాపై అంచనాలు పెరిగాయి. 
Vishal Abhimanyudu Weekend Record Collections In Tollywood - Sakshi
ఆ అంచనాలకు తగ్గట్టుగానే టెక్నాలజీ రంగంపై డిఫరెంట్ కాన్సెప్ట్ తో అర్జున్, సమంత లాంటి టాప్ నటులతో ‘అభిమన్యుడు’ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో కనక వర్షం కురిపించింది.  విశాల్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అభిమన్యుడు నిలిచింది.  మొదటి వారాంతానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 7కోట్లు వసూళ్లను సాధించింది. ఓ డబ్బింగ్‌ సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ సాధించడం చూసి చాలా కాలమైంది. తమిళ నాట కూడా ఈ సినిమా రికార్డ్‌ కలెక్షన్లను సాధించింది. 


ఏరియా వైజ్ గా ‘అభిమన్యుడు’ కలెక్షన్లు : 
నైజాం 3.20
సీడెడ్ 1.12
నెల్లూరు 0.40
కృష్ణ 0.83
గుంటూరు 0.78
వైజాగ్ 1.61
ఈస్ట్ గోదావరి 0.85
వెస్ట్ గోదావరి 0.60
ఏపీ అండ్ టీఎస్ షేర్ 9.39 కోట్లు
తమిళనాడు 15.00
కర్ణాటక 1.00
కేరళ 0.60
ఇతరప్రాంతాలు 0.20
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ 26.19 కోట్లు 


మరింత సమాచారం తెలుసుకోండి: