తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్.   నందమూరి బాలకృష్ణ తన తండ్రి చిత్రాన్ని ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా తెరకెక్కించాలని చూస్తున్నారు.  గతంలో తన వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన క్రిష్ ని దర్శకులుగా తీసుకున్నారు.   తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే.
Image result for ntr biopic
తాజాగా చిత్రీకరణ జరుగుతున్న చోటికి ఒక విశిష్ట అతిథి వచ్చారు. ఆయన మరెవరో కాదు.. ఫిలిం సిటీ అధినేత.. మీడియా మొఘల్ రామోజీ రావు.  ఆయన అరగంట పాటు అక్కడే ఉండి సినిిమా విశేషాలు తెలుసుకున్నారట.  కాగా, ఈ చిత్రంలో రామోజీ పాత్ర కూడా ఉండబోతున్నట్లు సమాచారం. క్రిష్ ఈ సందర్భంగా సినిమాలో ఆయన పాత్ర గురించి కూడా వివరించినట్లు చెబుతున్నారు.
Image result for ntr biopic
రామోజీ కూడా క్రిష్ కు కొన్ని సలహాలు ఇచ్చారట. రాజకీయంగా  ఎన్టీఆర్ ఎదుగుదలలో రామోజీ రావుది కూడా కీలక పాత్ర. ఈనాడు పత్రిక ఎన్టీఆర్ కు తిరుగులేని మద్దతు ఇచ్చింది. ఆయనకు గొప్ప కవరేజీ ఇచ్చి.. జనాలు ఆయన వైపు మళ్లేలా వార్తలు.. కథనాలు ఇచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయనకు అండగా నిలిచారు రామోజీ. అయితే రామోజీ పాత్రలో ఎవరు నటిస్తున్న విషయం క్లారిటీ రాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: