అఖిల్ కు ఇంకా దురదృష్టం వెంటాడుతూనే ఉంది అని చెప్పడానికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ‘హలో’ మూవీతో కూడ కోరుకున్న విజయాన్ని అందుకోలేకపోయిన అఖిల్ అనేక ఆలోచనలు చేసి వెంకీ అట్లూరి చెప్పిన కథను ఓకె చేసిన విషయం తెలిసిందే. 
venky atluri and akhil akkineni
ఇప్పటికే ఈమూవీ షూటింగ్ జరుగుతున్న నేపధ్యంలో ఈ కొత్త మూవీలో అఖిల్ లుక్ ఎలా ఉంటుంది అన్న విషయమై అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించి క్రియేటివ్ క్లాషెష్ మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ క్రియేటివ్ క్లాషెష్ వల్ల ఈసినిమా ఆగిపోతుంది అనే గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి.  
Venky Atluri Akhil movie UK schedule
ఇక వివరాలలోకి వెళ్ళితే వెంకీ అట్లూరికి ఒక్క సినిమా మాత్రమే చేసిన అనుభవం ఉన్న విషయం తెలిసిందే. అయితే తన మొదటి సినిమాతోనే వెంకీ అట్లూరి హిట్ అందుకున్నాడు. అఖిల్ ఇప్పటి వరకు రెండు సినిమాలలో నటించినా ఏసినిమా కనీస విజయం కూడ అందుకోలేదు. ఇప్పుడు ఈ తేడాలే వీరిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ కు కారణం అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి కథాపరంగా వెంకీ అట్లూరి చెబుతున్న నెరేషన్ అఖిల్ కు నచ్చడం లేదు అని టాక్. 

అఖిల్ తనకు తోచిన మార్పులు చెపుతున్నా ఆ మార్పులు వెంకీ అట్లూరికి నచ్చడం లేదని అంటున్నారు. దీనితో ప్రతి సీన్ ను 2-3 రకాలుగా షూట్ చేస్తూ ఫైనల్ గా ఎడిటింగ్ దగ్గర నిర్ణయించుకుందాం అని వెంకీ అట్లూరి అఖిల్ తో చెపుతున్నట్లు ఇండస్ట్రీ గాసిప్. దీనితో అసహనానికి లోనైన అఖిల్ ఈమూవీ షూటింగ్ కు రెండు రోజులు డుమ్మా కొట్టినట్లు కూడ వార్తలు వస్తున్నాయి.  దీనితో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలతో అఖిల్ కు మరోసారి పరాజయం ఎదురౌతుందా అంటూ ఇండస్ట్రీలోని కొందరు ఈపుకార్లను ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: