బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు తీసిన రాజమౌళి సంవత్సరం అయినా ఏ సినిమా మొదలు పెట్టలేదు.  అయితే ఆ రెండు సినిమాలకు దాదాపు ఐదు సంవత్సరాలు కేటాయించిన రాజమౌళి తన తదుపరి సినిమా పై కూడా భారీ అంచనాలు ఉంటాయని తెలుసు..అందుకోసమే ఆయన ఈసారి మల్టీస్టారర్ సినిమాతో వస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ తో కెరీర్ మొదలు పెట్టిన రాజమౌళి ఇప్పటి వరకు అపజయం అన్నది ఎరుగడు. 
Image result for ss rajamouli rrr
తనకు సక్సెస్ ఇచ్చిన ఎన్టీఆర్ తో సింహాద్రి, యమదొంగ సినిమాలు తీశారు.  ఇక మెగా వారసుడైన రాంచరణ్ తో రెండో సినిమా చరిత్రలో నిలిచిపోయే విధంగా తీశారు.  ‘మగధీర’ రాంచరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం తెరవెనుక సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో త్రివిక్రమ్ సినిమా విడుదల కాగానే ఎన్టీఆర్ నవంబర్ నుంచి ఈ సినిమా సెట్ మీదకు వస్తారని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి.

అలాగే బోయపాటి తో చేస్తున్న సినిమాను ఫినిష్ చేసి, డిసెంబర్ నుంచి చరణ్ వస్తాడని కూడా వార్తలు వచ్చాయి.  తాజా సమాచారం ప్రకారం...ఈ సినిమా షూటింగ్ ప్లానింగ్ ఓ నెల వెనక్కు జరిగిందన్నది. అనుకున్నట్లు నవంబర్ నుంచి కాకుండా డిసెంబర్ నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనికి  కారణం, ఇంకా స్క్రిప్ట్ లాక్ కాకపోవడమే. స్టిల్ ఇప్పటికీ రాజమౌళి అండ్ టీమ్ స్క్రిప్ట్ డిస్కషన్లు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కూడా గ్రాఫిక్స్ వర్క్ దిట్టంగానే వుంటుంది. ఎందుకంటే బ్రిటిష్ కథాకాలం ఎంతో కొంత వుంటుందని టాక్ వినిపిస్తోంది. సో, స్టోరీ బోర్డు రెడీ కావాలి. అంతకు ముందు స్క్రిప్ట్ లాక్ కావాలి. ఇద్దరు హీరోలు రెడీ కావాలి. అన్నీ దృష్టిలో పెట్టుకుని, డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: