గత కొన్నిరోజులుగా రానా ఆరోగ్యం పై అనేక వార్తలు హడావిడి చేస్తూనే ఉన్నాయి. ఈవార్తలలో నిజం లేదు అంటూ అటు రానా ఇటు సురేశ్ బాబు ఖండనలు ఇస్తూ ఉన్నా నిప్పులేనిదే పొగరాదు కదా అంటూ ఈవార్తలను ప్రచారంలోకి తీసుకువస్తున్న వ్యక్తులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. 
Venkatesh, Naga Chaitanya multi-starrer launch
ఇలాంటి పరిస్థుతులలో నిన్న బుధవారం వెంకటేష్ నాగచైతన్యాల మూవీ ప్రారంభోత్సవంలో రానాను చూసిన మీడియా వర్గాలు షాక్ అయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈకార్యక్రమాన్ని కవర్ చేయడానికి మీడియా వర్గాలను పిలవలేదు. కేవలం ఈసినిమా యూనిట్ ఫోటోగ్రాఫర్లు మాత్రమే ఈ కార్యక్రమ ఫోటోలు తీసారు అని తెలుస్తోంది. 

ఈకార్యక్రమానికి సంబంధించి కేవలం రెండు ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి వాటిలో రానా లేడు. అయితే ఇదే కార్యక్రమానికి సంబంధించి మరొక ఫోటో అనుకోకుండా లీక్ అయింది. ఈఫోటోలో అందరితో కలిసి రానా ఉన్నాడు. దీనితో ఈ ఫంక్షన్ కు రానా వచ్చినా ఎక్కువ సేపు ఉండలేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Suresh Babu press meet: Issues, Preachings and Facts
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఫంక్షన్ లో రానాను చూసిన చాలామంది షాక్ అయినట్లు సమాచారం. ‘బాహుబలి’ లో భల్లాల దేవుడుగా కండలు పెంచి కనిపించిన రానా చాల నీరసంగా అదేవిధంగా సన్నగా కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమం కవర్ చేస్తున్న ఫోతోగ్రాఫార్లను రానా ఫోటోలు తీయకుండా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని కూడ వార్తలు వస్తున్నాయి. దీనితో మళ్ళీ రానాకు ఏమైంది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: