ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతన్నాయి. ఓ వైపు ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నా..ప్రమాదాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు.  తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో సినీ నటి మోనాల్ గుజ్జార్ గాయపడింది.  మోనాల్ తన స్నేహితుడు డాక్టర్ రోహిత్ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబసభ్యులు స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉదయ్ పూర్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది.  అయితే కారు ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగినట్లు కారు ను చూస్తే అర్ధం అవుతుంది.


ఈ ప్రమాదంలో ఎవరూ బతికే ఛాన్స్ లేదని అనుకున్నారు అందరూ...దాంతో సోషల్ మీడియాలో సినీ నటి మోనాల్ రోడ్డు ప్రమాదంలో మృతి అన్న వార్తలు వైరల్ అయ్యాయి.  వెంటనే దీనిపై స్పందించిన నటి మోనాల్ గుజ్జార్..ఓ పోస్ట్ పెట్టారు. వాస్తవానికి కారు ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ తమ కుటుంబానికి ఏ ప్రమాదం జరగలేదు..ఆ సమయంలో తాను సీటు బెల్ట్ పెట్టుకోవడం మంచిదైందని అన్నారు.  కాకపోతే తన మెడ బెణకడంతో నొప్పి ఉందని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. 


 అల్లరి నరేష్ నటించిన సుడిగాడు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో అల్లరి నరేష్ జంటగా అందాల భామ మోనాల్ గుజ్జర్ నటించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో కూడా నరేష్ పక్కన నటించింది.  తాజాగా మోనాల్ గుజ్జర్  గుజ్జార్ భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. మోనాల్ చివరగా గుజరాతీ చిత్రం ‘రేవా’లో నటించారు. ప్రస్తుతం ఆమె గుజరాతీ చిత్రం ‘ఫ్యామిలీ సర్కస్ ’ లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు గుజరాతీ హిందీ తమిళ్ మలయాళ చిత్రాల్లో మోనాల్ నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: