నిన్న ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ షోలో మంచి - చెడు టాస్క్ బిగ్ బాస్ హౌస్ సభ్యుల మధ్య తీవ్ర గందరగోళాన్ని రేపి దిగజారిన పదజాలానికి తావు ఇవ్వడంతో ఈ షోను నిలబెట్టడానికి ఇలాంటి ట్రిక్స్ అవసరమా అన్న సందేహాలకు తావిచ్చింది. ముఖ్యంగా కౌశల్, భానుశ్రీ మధ్య వివాదం ఆ వివాదాన్ని పెద్దది చేయడానికి తేజస్విని చేసిన ప్రయత్నాలు బుల్లితెర ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్ని కలిగించిది.
భానుశ్రీపై కౌశల్ దురుసుగా
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా మంచి, చెడు ఆటను ఆడాలని ‘బిగ్‌ బాస్‌’ సూచించిన నేపధ్యంలో బిగ్ బాస్ హౌస్ సభ్యులు నల్లటి తెల్లటి దుస్తులతో కనిపిస్తూ తమ మాటలతో పెద్ద యుద్ధమే చేసుకున్నారు. ఈ టాస్క్‌లో భాగంగా ఒక యాపిల్‌ను భానుశ్రీ తన ప్యాంటులో దాచింది దానిని లాగుకునే ప్రయత్నంలో కౌశల్ దురుసుగా ప్రవర్తించిన పరిస్థుతులలో అనుకోకుండా కౌశల్ చేయి భానుశ్రీ ఛాతికి తగిలింది. 
మంచి, చెడు టాస్క్ రచ్చ రచ్చ
ఈ విషయాన్ని చాలపెద్ద ఇష్యూగా చేసి భానుశ్రీ రచ్చ చేయడమే కాకుండా కావాలని కౌశల్ తన ఛాతి లోపలకి చేయి పెట్టాడు అంటూ హడావిడి చేయడంతో మొదలైన మాటల యుద్ధానికి తేజస్విని మరింత రెచ్చి పోవడంతో అసభ్యకరమైన మాటలతో కూడిన షోగా ‘బిగ్ బాస్ 2’ మారిపోయింది. తన ఓవర్ యాక్షన్ కొనసాగిస్తూ కౌశల్ క్యారెక్టర్ పై మాటల దాడి చేసింది తేజస్విని. 
Watch Bigg Boss Online
ఇది చాలదు అన్నట్లుగా దీప్తి సునైనాను సామ్రాట్ దారుణంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి జైలులో బంధించడానికి చేసిన ప్రయత్నాలు చూసిన వారికి ఈషో పై రోత పుట్టించడం ఖాయం. ఒక వైపు బిగ్ బాస్ హౌస్ మేట్స్ లోని అమ్మాయిలు అంతా అబ్బాయిలను అన్న అని పిలుస్తూ మరొక వైపు రోత పుట్టించే అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న తీరును చూసిన వారికి ఈ షోను ఎందుకోసం ప్రసారం చేస్తున్నారు అని అనిపించడం సహజం. ఇలాంటి పరిస్థుతులలో ఘోరంగా పడిపోతున్న రేటింగ్స్ ను బూతులు కూడ రక్షించలేవు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: