ప్రముఖ కన్నడ నటుడు యశ్‌ను రెండున్నరేళ్లకు మునుపు హత్య చేసేందుకు బెంగళూరులో పేరుమోసిన రౌడీషీటర్ సైకిల్ రవి స్కెచ్ వేశాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. పలు కేసులకు సంబంధించి ప్రస్తుతం న్యాయ నిర్బంధంలో ఉన్న రవికుమార్‌ అలియాస్‌ సైకిల్‌ రవిని విచారించే సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ప్రచారం మొదలైంది.  రాకింగ్ స్టార్ యష్ హత్యకు కుట్ర జరుగుతోందని గురువారం జోరుగా ప్రచారం జరగడంతో సీనియర్ పోలీసు అధికారులు స్పందించారు.
Image result for కన్నడ నటుడు యశ్‌
రాకింగ్ స్టార్ యష్ హత్యకు ఎలాంటి కుట్ర జరగలేదని, ఈ విషయంపై విచారణ చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి సతీష్ కుమార్ గురువారం వివరణ ఇచ్చారు.  యశ్‌ హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై కొందరు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని, త్యాగరాజనగర ఠాణా పరిధిలో రౌడీషీటరు కోదండరామ ఈ హత్యకు సూత్రధారి అని ప్రచారం జరిగింది. గతంలో రవికుమార్‌, కోదండరామ బద్ధ శత్రువులు. మూడేళ్లకు మునుపు వీరిద్దరి మధ్య ఒక రౌడీషీటరు రాజీ పంచాయితీ చేశాడు.
Image result for కన్నడ నటుడు యశ్‌
అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగిందని సతీశ్‌కుమార్‌ చెప్పారు.  స్యాండిల్ వుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులతో సైకిల్ రవికి పరిచయం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కోదండ రామ పరారీలో ఉన్నాడు. ఈ వదంతులను సృష్టించిన వారి కోసం గాలిస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు.  వదంతులు వచ్చిన తరువాత యశ్‌ను పలువురు నటులు ఫోన్‌ చేసి పరామర్శించారు. మరికొందరు సీనియరు నటులు ఆయనకు ధైర్యం చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: