సాధారణంగా తమకు ఇష్టమైనది నోటిదగ్గరకు వచ్చి చటుక్కున మాయమైతే..ఎంత బాధ ఉంటుంది..అదీ కూడా కళ్ల ముందు తిరుగుతుంటే..ఆ బాధ వర్ణనాతీతం.  సాధారణంగా ఎవ్వరికైనా స్వీట్స్ , ఐస్ క్రీమ్స్ అంటే ఎంతో ప్రాణం..తాజాగా బాలీవుడ్ కమెడియన్ కి తన నోటిదాకా వచ్చిన ఐస్ క్రీమ్ ఎలా మాయమైంది..ఆ సెల్లర్ ఎలా ఆటపట్టించాడు అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ కమెడియన్ అలీ అస్ఘర్‌ బాలీవుడ్‌ మూవీల్లో, వెబ్‌ సిరీస్‌లో నటించారు.

ఆయన ఇటీవల టర్కీ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఇస్తాంబుల్‌లో ఐస్‌క్రీమ్‌ తినాలని ఆశపడ్డారు. షాపు అతడికి ఐస్‌క్రీమ్‌ కావాలని చెప్పగా... అంతే ఆ సెల్లర్ అలీ అస్ఘర్‌ ని ఓ రేంజ్ లోఆటపట్టించాడు. ఇచ్చినట్లే ఇస్తూ..వెనక్కి తీసుకుంటూ అటూ ఇటూ తిప్పుతూ దాన్ని మాయం చేశాడు.  తర్వాత మళ్లీ ఐస్ క్రీమ్ బయటకు తీసి మరోసారి ఆటపట్టించి తర్వాత అలీ అస్ఘర్‌ చేతిలో పెట్టాడు. 
Image result for aamir khan istanbul ice cream
గతంలో మిస్టర్ పర్ ఫెక్ట్ అమిర్ ఖాన్ కూడా ఇస్తాంబుల్‌లో ఐస్‌క్రీమ్‌ తినాలని ఆశపడ్డారు. ఆ షాప్ సెల్లర్ అచ్చం ఇలాగే చేసి ఆటపట్టించాడు.  అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది.  తాజాగా అలీ అస్ఘర్‌ ని ఐస్ క్రీమ్ సెల్లర్ ఆటపట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  పాపం నటుడి ఓపికకు పెద్ద పరీక్ష పెట్టాడని మరికొందరు రీట్వీట్లు చేస్తున్నారు. చివరకు ఎంచక్కా ఐస్‌క్రీమ్‌ను నటుడు ఎంజాయ్‌ చేస్తూ తినేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: