సౌత్ లో క్రేజీ బ్యూటీగా హీరోయిన్ త్రిషా దాపు తెలుగు, తమిళ స్టార్ హీరోల అందరితో కలిసి నటించింది. కొన్నాళ్లు కెరియర్ లో వెనుకపడ్డ త్రిషా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వస్తుంది. ప్రస్తుతం త్రిష లీడ్ రోల్ లో విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న సినిమా 96.


ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. టీజర్ చూసి కచ్చితంగా ఇది డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. డైలాగులేమి లేని ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ పాటతో రిలీజ్ చేశారు. త్రిష లైట్ మేకప్ తో కనిపిస్తుండగా విజయ్ సేతుపతి మాత్రం ముందు రఫ్ లుక్ తో కనిపించి త్రిష పరిచయం తర్వాత గడ్డెం తీసి స్మార్ట్ గా కనిపించాడు. 


చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య జరిగే కథే ఈ 96 అని తెలుస్తుంది. టీజర్ మాత్రం అంచనాలు ఏర్పడేలా చేసింది. నందకిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో త్రిషా మళ్లీ తన సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న త్రిష సరైన సినిమా పడితే స్టామినా ప్రూవ్ అవుతుంది.


తమిళంలో నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. తప్పకుండా త్రిష ఈ 96 సినిమా కూడా అలానే ఉండబోతుందని చెప్పొచ్చు. విజయ్, త్రిషల ఈ 96 టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా అలానే ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని ఆశిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: