పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా కంటి సమస్యతో భాదపడుతున్న విషయం తెలిసిందే.   వాస్తవానికి ఈకంటి సమస్య గురించి అతడి అభిమానులకి ‘రంగస్థలం’ సక్సస్స్ మీట్ లో తెలిసింది. అయితే వెంటనే శస్త్ర చికిత్య చేయించుకోమని వైద్యులు చెప్పినా తన పొలిటికల్ షెడ్యూల్ కారణంగా పవన్ తన కంటి శస్త్ర చికిత్య పై దృష్టి పెట్టలేదు.    
వారం రోజులు విశ్రాంతి
విశాఖ పర్యటనతో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ ముగిసిన నేపధ్యంలో పవన్ ఈ శస్త్ర చికిత్య చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో పవన్ చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు పవన్ కంటిపై ఏర్పడ్డ కురుపుని తొలగించారు. 
రంగస్థలం సక్సెస్ మీట్ లోనే
గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుంచి డిచ్చార్జీ అయినట్లు తెలుస్తోంది. శస్త్ర చికిత్స తరువాత వారం రోజులపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు పవన్ కళ్యాణ్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీనితో పవన్ కళ్యాణ్ తదుపరి పొలిటికల్ కార్యక్రమాలు టూర్ లు మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం ఉంది. 
 ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో
ఈమధ్య ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో పవన్ ‘జనసేన’ కు 10 నుంచి 12 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి అని వార్తలు వచ్చిన నేపధ్యంలో కనీసం పవన్ కళ్యాణ్ ‘జనసేన’ కు డబల్ డిజిట్ సంఖ్యలో సీట్లు వస్తాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా పవన్ చేస్తున్న ఉపన్యాసాలను అదేవిధంగా తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి అంటూ చేస్తున్న అభ్యర్ధనలు ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని గందరగోళంలో పడేస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: