టాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలు ఈ మద్య బాలీవుడ్, కోలీవుడ్ లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ మంచి హిట్ అయ్యింది.  అంతే కాదు అప్పటి వరక ఫ్లాపుల ఇబ్బందుల్లో ఉన్న ఎన్టీఆర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది.  ఈ సినిమాలో క్లయిమాక్స్ లో కోర్టు సీన్లు ఇప్పటికే ప్రేక్షకుల గుండెల్లో పదిలాంగా ఉండేలా చేశాయి. 

కంటెంట్ పరంగా ఈ సినిమా ఇతర భాషా దర్శక నిర్మాతలను .. హీరోలను ఆకట్టుకుంది.  ఇక టెంపర్ సినిమా బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు.  రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ షర వేగంగా జరుపుకుంటుంది.  తాజాగా ప్రముఖ నిర్మాత 'ఠాగూర్' మధు .. విశాల్ హీరోగా ఈ సినిమాను తమిళంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టనున్నారు.
Image result for temper ntr
తమిళనాట విశాల్ కి మాస్ ఇమేజ్ ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమాకి ఆయన కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో తెలుగులో 'పందెం కోడి 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.  అంతే కాదు ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను 'ఠాగూర్' మధు తీసుకున్నాడు. శాటిలైట్ హక్కులు .. తెలుగు వెర్షన్ హక్కులను కలుపుకుని దాదాపు 10 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: