ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ …. కన్నుకొట్టి కోట్ల మంది అభిమానులను సంపాదించేసుకుంది. అప్పట్లో డబ్బులు కూడా అదేరేంజిలో సంపాదించింది.  కానీ అన్ని సమయాలు ఒకేలా ఉండవు కదా..ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రియా వారియర్ పరిస్థితి అయోమయంలో పడింది.  కనుసైగలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో నిర్మాతలందరూ ఆమె వెనుక పడ్డారు. ఓవర్‌నైట్ ఈ టీనేజ్ అమ్మాయి సెలబ్రిటీగా మారిపోయింది. మలయాళంలోని ఒక సినిమాలో చిన్న పాత్రను పోషించింది ప్రియాప్రకాష్ వారియర్.
Image result for priya varrier prakash
ప్రియాప్రకాష్‌ వారియర్ నటించిన సినిమాను నిలిపివేసి మళ్ళీ రీషూట్ ప్రారంభించారట నిర్మాతలు. ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్ కావడంతో ఆమెతో సినిమాలు చేయాలని టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు భావించారు. ప్రియావారియర్‌కి సినిమాల్లో ఎన్ని అవకాశాలొచ్చినా ‘చదువు పూర్తయిన తరువాతే’అంటూ అన్నీ తిప్పి కొడుతోంది.   

కొన్నిరోజుల తరువాత ఆమె వెనుక పడటం మానేశారు. ఆ మద్య   పెద్ద సినిమాలు ఆమె ఖాతాలో పడతాయన్న ప్రచారం అప్పట్లో బాగానే జరిగింది. కానీ ఇప్పటివరకు ఒకే ఒక్క సినిమా కూడా ఆమె చేతిలో లేదు. దీంతో ప్రియా కనీసం యాడ్స్ లోనైనా నటించి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఉందట.
Image result for priya varrier prakash
సినిమా అంటే బోలెడన్ని రోజులు కేటాయించాలి. దాంతో చదువు డిస్టర్బ్‌ అవుతుంది. అదే యాడ్స్‌ అయితే రెండు లేదా మూడురోజులలో షూటింగ్‌ అయిపోతుంది. డబ్బుకి డబ్బు వస్తుంది.. ప్రకటనలతో అభిమానులకు ఎప్పుడూ కనపడుతూ ఉండొచ్చు అని భావించింది.   అప్పట్లో వరుసగా వచ్చిన ఆఫర్ నెమ్మదిగా తగ్గిపోయిందట.  దాంతో ప్రియా ప్రకాష్‌ వారియర్ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్‌గా ఉంటోందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: