దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం "ఎన్టీఆర్‌". భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు ఎవరనే విషయంపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది.
  Image result for ntr biopic
ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏఎన్ఆర్  పాత్రలో ఆయన మనువడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా..దానిపై పూర్తి క్లారిటీ లేదు.    తాజాగా విజయ వాహిని స్టూడియో అధిపతి బి.నాగిరెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించేందుకు అంగీకారం తెలిపారు.  ఎన్టీఆర్ కి కథానాయకుడిగా పల్లెటూరి పిల్లతో తొలి అవకాశాన్నిచ్చిన దర్శకుడు బి.ఎ. సుబ్బారావు పాత్రలో సీనియర్ నటుడు నరేష్ కనిపించబోతున్నారు.

Image result for ntr biopic

వీళ్లిద్దరిపై త్వరలోనే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం.    అయితే మహానటిలో అట్లూరి చక్రపాణి పాత్రలో నటించారు ప్రకాశ్ రాజ్ .  మహానటిని గొప్ప స్థాయిలోకి తీసుకు వచ్చిన వారిలో చక్రపాణి ఒకరు.  ఒకప్పుడు నాగిరెడ్డి, చక్రపాణి చిత్రం అంటే గొప్ప చిత్రంగా చూసేవారు.  మహానటిలో చక్రపాణి, ఎన్టీఆర్ బయెపిక్ లో నాగిరెడ్డిగా ప్రకాశ్ రాజ్ మరో అద్భుతం సృష్టించబోతున్నారన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: