మెగా ఫ్యామిలీ హీరోల సంఖ్య క్రికెట్ టీమ్ సంఖ్యను చేరుకోవడంతో సంవత్సరంలోని 12 నెలలు వీరి సినిమాల విడుదలకు సరిపోవడం లేదు. దీనితో ఒకే నెలలో ఇద్దరు మెగా యంగ్ హీరోల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల చేసుకోవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అక్కినేని కాంపౌండ్ కు కూడ ఏర్పడబోతోందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
Nagarjuna Talks about Naga Chaitanya and Akhil' love
దీనికి కారణం రాబోతున్న ఆరు నెలలలో అక్కినేని కాంపౌండ్ హీరోల నుండి 6 సినిమాలు విడుదల కాబోతున్నాయి. నాగార్జున నాగచైతన్య అఖిల్ సినిమాలతో పాటు సుశాంత్ సుమంత్ సినిమాలు కూడ రాబోతున్న 6 నెలలలో ఒకదాని పై ఒకటి పోటీగా విడుదలవుతున్న నేపధ్యంలో మెగా కాంపౌండ్ వారసత్వం ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ కు ట్రాన్స్ ఫర్ అయిందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 

ఈ నెలాఖరున సుశాంత్ నటించిన ‘చి.ల.సౌ.’ విడుదల అవుతుంటే వచ్చేనెల నాగచైతన్య ‘శైలజ రెడ్డి అల్లుడు’ విడుదల కాబోతోంది. సెప్టెంబర్ నెలలో నాగార్జున నానీలు నటించిన ‘దేవదాస్’ తన డేట్ ను ఫిక్స్ చేసుకుంటే అదే నెలలో కాని లేదంటే అక్టోబర్ లో నాగచైతన్య ‘సవ్యసాచి’ విడుదలకు రెడీ అవుతోంది.

ఈమధ్యలో ఎదో ఒక గ్యాప్ తీసుకుని సుమంత్ నటించిన ‘ఇదం జగత్’ విడుదలకు ముస్తాబ్ అవుతోంది. ఈ ఏడాది చివరి లోపే అఖిల్ వెంకీ అట్లూరిల కాంబినేషన్ లో
రూపొందుతున్న మూవీ కూడ విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇలా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అక్కినేని కాంపౌండ్ హీరోల సినిమాలు కేవలం ఆరు నెలలలో 6 సినిమాలు విడుదల కావడం అక్కినేని కాంపౌండ్ రికార్డు అని అంటున్నారు. దీనితో మెగా కాంపౌండ్ హీరోల రికార్డ్ కు చెక్ పెట్టే దిశగా అక్కినేని కాంపౌండ్ ఆలోచనలు ఉన్నాయా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: