నాగశౌర్య నిహారికలు తమ ప్రేమ వ్యవహారానికి బ్రేకప్ చెప్పారు అంటూ హైదరాబాద్ నుండి ప్రచురింప బడుతున్న ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక షాకింగ్ కథనాన్ని ప్రచురించింది. ‘ఒక మనసు’ సినిమాలో కలిసి నటించిన నాగశౌర్య నిహారికలు ఆసినిమా షూటింగ్ లోనే ఒకరి పై ఒకరు మనసు పడ్డారు అంటూ కొన్ని కథనాలు హడావిడి చేసాయి. 

అయితే ఆవార్తలను ఆతరువాత వీరిద్దరూ వేరువేరు సందర్భాలలో ఖండించారు. కొంతకాలం క్రితం వీరిద్దరి ప్రేమను వీరి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారని త్వరలో వీరి వివాహ నిశ్చతార్ధం కూడ జరగబోతోంది అంటూ కొన్ని కథనాలు కూడ మీడియాలో వచ్చాయి. అయితే వాటి పై వచ్చిన వార్తలను కూడ వీరిరువురు ఖండించారు. 

ఇది ఇలా ఉండగా వీరిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పారు అంటూ ఒక షాకింగ్ కథనాన్ని ఈ ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించింది. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రేమ విషయాల పై శ్రద్ధ పెట్టేకన్నా తమ కెరియర్ సినిమాలకు సంబంధించి శ్రద్ధ పెడితే బాగుంటుంది అని వీరిద్దరి కుటుంబాల పెద్దల సలహాలతో వీరి ప్రేమ బ్రేకప్ జరిగింది అన్న వార్తను ఆపత్రిక ప్రచురించింది. 


దీనితో నిహారిక ప్రస్తుతం నటిస్తున్న ‘హ్యాపీ వెడ్డింగ్’ రిలీజ్ కు రెడీ అవ్వడంతో మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందు కెరియర్ పరంగా బిజీ హీరోయిన్ గా మారాలని ఆశ పడుతోంది అంటూ ఆపత్రిక తన కథనంలో పేర్కొంది. అదేవిధంగా నాగశౌర్య కూడ తన సినిమాల వేగాన్ని పెంచడానికి నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనితో కొంతకాలం వీరిద్దరి పై వార్తలు వచ్చే వ్యవహారానికి గ్యాప్ ఏర్పడిన నేపధ్యంలో ఈ గ్యాప్ ఎంతకాలం కొనసాగుతుంది చివరకు ఏమౌతుందో వేచి చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: