విక్టరీ వెంకటేష్ నటించిన ‘చంటి’ చిత్రంలో విలన్ గా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న వినోద్  బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఆయన శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో మరణించారు. వినోద్‌ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి.


 హీరోగా సినీ కెరీర్ మొద‌లు పెట్టి ఆ త‌ర్వాత విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ప్ర‌ముఖ సినీ న‌టుడు వినోద్ ఈ రోజు తెల్ల‌వారు జామున 3 గం.ల‌కి బ్రెయిన్ స్ట్రోక్ కార‌ణంగా మృతి చెందారు. తెనాలికి చెందిన వినోద్ 300కి పైగా సినిమాలలో న‌టించారు. 1980లో వి.విశ్వేశ్వ‌ర‌రావు డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన కీర్తి కాంత క‌న‌కం అనే సినిమాలో హీరోగా న‌టించిన ఆయ‌న చంటి సినిమాతో ప్ర‌త్యేక గుర్తింనపు తెచ్చుకున్నాడు.  


వినోద్ తమిళంలో 28, హిందీలో 2 చిత్రాలతో పాటు సిరియ్స్ లో కూడా నటించారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప‌లు హిట్ సినిమాల‌లో న‌టించిన వినోద్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. వినోద్ అస‌లు పేరు అరిశెట్టి నాగేశ్వ‌ర‌రావు. ఆయ‌న మృతితో కుటుంబం శోక సంద్రంలో మునిగింది. వినోద్ మృతికి టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: