కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ మీడియా ఛానల్స్ ఫై మాటల దాడి చేసినప్పటి నుంచి కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ పవన్ పై అప్రకటిత బ్యాన్ విధించడంతో పవన్ వార్తల హడావిడి మీడియా ఛానల్స్ లో చాల తక్కువగా కనిపిస్తోంది. పవన్ తన పోరాట యాత్రలో చేస్తున్న ప్రసంగాల కవరేజ్ కూడ అంతంత మాత్రంగానే ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి.
pawan kalyan powerful speech at palasa
ఈ నేపధ్యంలో తన పై జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీకి అడ్డుకట్ట వేయడానికి పవన్ విసిరిన మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ న్యూస్ గా మారింది. ఒకేసారి పవన్ రెండు న్యూస్ ఛానల్స్ ను తన ఆధిపత్యంలోకి తీసుకోబోతూ ఉండటం పవన్ స్టామినాను సూచిస్తోంది.
huge public turnout for pawan porata yatra in srikakulam: janasena
తెలుస్తున్న సమాచారం మేరకు 99టివి ఛానల్ ను భారీ మొత్తానికి పవన్ కు అత్యంత సన్నిహితుడైన తోట చంద్రశేఖర్ కొంటే 10 టివి లోని మేజర్ షేర్స్ ను మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ ప్రసాద్ కొన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. త్వరలో ఈ రెండు ఛానల్స్ లోను పవన్ స్పీచ్ లకు లైవ్ కవరేజ్ ఇస్తూ ‘జనసేన’ పార్టీకి మౌత్ పీస్ లులా ఈ రెండు ఛానల్స్ ను తీర్చిదిద్దడానికి విశేష అనుభవం ఉన్న న్యూస్ ఎడిటర్స్ ను పవన్ నియమిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే తెలుగులో న్యూస్ ఛానల్స్ మధ్య పోటీ ఎక్కువైపోయిన నేపధ్యంలో పవన్ నేతృత్వంలో ఈ రెండు ఛానల్స్ కూడ తిరిగి యాక్టివ్ అయితే ఈ న్యూస్ ఛానల్స్ మధ్య పోటీ మరింత తీవ్రం అవుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీల భావజాలంతో నిర్వహింపబడుతున్న ఈ ఛానల్స్ పవన్ చేతికి రావడంతో రానున్న రోజులలో ‘జనసేన’ ‘కమ్యూనిస్టుల’ మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉంది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: