ఈ రోజు టాలీవుడ్ లో వరుస విషాదాలు కంటతడి పెట్టిస్తున్నాయి.  ప్రముఖ క్యారెక్టర్ నటుడు వినోద్ బ్రెయిన్ స్టోక్ తో మృతి చెందారు.  ఇక అలనాటి నేపథ్య గాయని కె.రాణి (75) గత రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు.  కళ్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంటిలో ఉంటున్న రాణి శుక్రవారం రాత్రి 9:10 గంటలకు తుదిశ్వాస విడిచారు.దేవదాసు చిత్రంలోని "అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా" అనే పాటతో పాపులర్ అయింది. 

సుమారు తన కెరీర్ లో 500 పాటలు పాడిన రాణి, శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఆమె ఆలపించడం విశేషం.  రాష్ట్రపతి భవన్లో తన గానామృతంతో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణను ఆకట్టుకున్న ఘటన ఆమె సొంతం.   9వ యేటే సినీ నేపథ్య గాయనిగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన ఆమె1951లో గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆమె పలు భాషల్లో 500 పాటలు పాడారు.

టాలీవుడ్ లో ఇప్పటికీ.. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ సినిమాలో ఆమె పాడిన ‘అంతా భ్రాంతియేనా..’ పాట ఇప్పటికీ ప్రముఖంగానే వినిపిస్తుంటుంది.  రూపవతి అనే తెలుగు సినిమా ద్వారా గాయనిగా వెండితెరకు పరిచయం అయ్యారు.  అనంతరం, బాటసారి, ధర్మదేవత, జయసింహ, లవకుశ వంటి హిట్ చిత్రాల్లో ఆమె పాటలు పాడారు.  గాయని రాణి మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: