తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విశాల్ ‘పందెంకోడి’తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా మంచి పేరు తీసుకు వచ్చాయి.  అయితే విశాల్ అచ్చమైన తెలుగు వాడే అయినా కోలీవుడ్ లో స్థిరపడ్డారు.  తమిళంలో తీసిన ప్రతి చిత్రం తెలుగు లో డబ్ చేస్తున్నాడు.  ఈ నేపథ్యంలో విశాల్, అర్జున్, సమంత నటించిన ‘అభిమన్యుడు’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  డబ్బింగ్ చిత్రం అయినా తెలుగు లో మంచి వసూళ్లు చేసింది.

అభిమ‌న్యుడు బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 20కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింద‌ని ట్రేడ్‌లో చెప్పుకున్నారు.  ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రికి భారీగా లాభాలొచ్చాయి.    తాజాగా విశాల్ నటించిన ‘పందెం కోడి’ సీక్వెల్ ‘పందెం కోడి 2’ చిత్రం రాబోతుంది.  సాధారణంగా విశాల్ మార్కెట్ రేంజు 4-5 కోట్ల మ‌ధ్య ఉండేది. అభిమ‌న్యుడు స‌క్సెస్‌తో అది డ‌బుల్ అయ్యింద‌ని ట్రేడ్‌లో విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో త్వ‌ర‌లో రిలీజ్‌కి వ‌స్తున్న `పందెంకోడి 2` (సందెకోజి 2) చిత్రాన్ని 10 కోట్ల మేర చెల్లించి ఠాగూర్ మ‌ధు రైట్స్ కొనుక్కున్నార‌ని తెలుస్తోంది. విశాల్ డెబ్యూ సినిమా `పందెంకోడి` క్రేజు తెలుగు జ‌నాల్లో ఇంకా అలానే ఉంది. అందుకే ఇప్పుడు `పందెంకోడి 2`కి అంతే క్రేజు నెల‌కొంది. అన్ని ఏరియాల బిజినెస్ డీల్ వేగంగా క్లోజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: