తెలుగు .. తమిళ చిత్ర సీమల్లో సమంత అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. ఈ రెండు భాషల్లోను ఈ కేరళ కుట్టికి ఎంతోమంది అభిమానులు వున్నారు. నటన విషయంలోనే కాదు .. వ్యక్తిత్వం విషయంలోను ఆమెను వాళ్లంతా ఎంతగానో అభిమానిస్తుంటారన్నది అక్షరాలా నిజం. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమాజ సేవ కోసం ఆమె సమయాన్ని కేటాయిస్తూనే వుంటారు. సమంత సంపాదించే ప్రతీ రూపాయిలోనుంది కొంత భాగం తను స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళంగా సమర్పించే విషయం విదితమే. అంటే కాకుండా చిన్నపిల్లలంటే సమంతకు చాలా ఇష్టం .. అనారోగ్యంతో బాధపడుతోన్న పిల్లలకు 'ప్రత్యూష ఫౌండేషన్' ద్వారా శస్త్ర చికిత్సలు కూడా చేయిస్తున్నారు.

Samantha at an event for hearing-impaired kids

అలా చాలామంది చిన్నారుల జీవితంలో ఆమె వెలుగులు నింపుతూ వారికి నూరేళ్ళ ఆయుష్షు నింపడానికి ఏంటో కృషి చేస్తుంది. తాజాగా ఆమె 70 యేళ్ల చరిత్ర కలిగిన 'ఫోనాక్' అనే సంస్థకి వచ్చారు. వినికిడి లోపంతో బాధపడుతోన్న చిన్నారుల సమస్యలను తీర్చే ఈ సంస్థకి తెలుగు రాష్ట్రాల్లో36 శాఖలున్నాయి. నిన్న ఈ సంస్థకి వెళ్లిన సమంత .. వినికిడి లోపంతో బాధపడుతోన్న పది మంది చిన్నారులకు వినికిడి యంత్రాలను అందించారు. భవిష్యత్తులోను ఈ సంస్థకి తన వంతు సాయం అందుతుందని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. అక్కడే సమంతా పిల్లలతో కొంత సమయం వరకూ ఆనందంగా గడిపి పిల్లల మనస్సుకు కాస్త ఊరట కలిగించి వచ్చింది.    

మరింత సమాచారం తెలుసుకోండి: