నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్.   నందమూరి హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’సినిమాతో హీరోగా మారారు.  ఆ తర్వాత ఆది, సింహాద్రి,రాఖీ లాంటి పవర్ ఫుల్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ‘యమదొంగ’ సినిమాలో సన్నగా మెరుపుతీగలా తయారయ్యాడు.  అప్పటి నుంచి స్లిమ్ గా మంచి ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తున్నాడు.
Image result for ntr trivikram
తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘అరవింద సమేత’ సినిమా లో షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే..సెలెక్ట్ మొబైల్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను మొట్టమొదట వాడిన ఫోన్..ఆల్కాటెల్. 
Image result for ntr trivikram aravinda sametha
ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజ్లు జగదీశ్ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ ఆల్కాటెల్ కొన్నానని అన్నారు. ఫోన్ ఎక్కువగా వాడతారా? సెల్ఫీలు బాగా దిగుతారా?’ అని ప్రశ్నించగా..‘ప్రపంచం మారిపోయింది. ఏమీ లేకున్నా సరదాగా ఫోన్ తీసి చూస్తున్నాం..నేను కూడా అంతే.  ఇక సెల్ఫీలు అంటారా..నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు..మా అవిడి నా ఫోటోలు తీస్తానంటే..కూడా ఒప్పుకోను..ఎందుకో తెలుసా నాకు ఫోజ్ పెట్టడం సరిగా రాదని అన్నారు.   

‘మొబైల్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు?’ అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా అలా లేనని, ఫోన్ లేకుండా ఉండటం అసాధ్యమని, ఫీచర్స్ వాడకపోయినా కమ్యూనికేషన్స్ కోసం తప్పకుండా ఉండలని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: