ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఎస్.ఎం.ఎస్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్ సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు. ప్రేమ కథా చిత్రం సినిమా సుధీర్ బాబు అకౌంట్ లోకి రాలేదు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన భలే మంచి రోజు మాత్రం సుధీర్ కు క్రేజ్ వచ్చేలా చేసింది. 


ఇక ఈ సినిమా తర్వాత కూడా మళ్లీ సుధీర్ తన సత్తా చాటాలని చూసినా వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా సుధీర్ బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వచ్చిన సమ్మోహనంతో మంచి హిట్ అందుకున్నాడు. సోలో హీరోగా సుధీర్ సత్తా చాటేలా సమ్మోహనం డీసెంట్ హిట్ అందుకుంది.


ఇలా సినిమా రిలీజ్ అయ్యిందో లేదో మరో సినిమాను లైన్ లో పెట్టాడు సుధీర్ బాబు. ఆర్.ఎస్ నాయుడు డైరక్షన్ లో సుధీర్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూ చేస్తున్న సినిమా నన్ను దోచుకుందువటే.. ఈరోజు టీజర్ తో వచ్చిన ఈ సినిమాతో సుధీర్ బాబు అసలు ఆట మొదలు పెట్టాడని చెప్పొచ్చు. ఇన్నాళ్లు ఆడియెన్స్ లో రిజిస్టర్ అయ్యేందుకు పాట్లుపడిన సుధీర్ బాబు సమ్మోహనంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. 


కాబట్టే నిర్మాతగా నన్ను దోచుకుందువటేతో సాహసం చేస్తున్నాడు. హీరోలు సినిమాలు నిర్మించాలంటే కేవలం డబ్బులు ఒకటుంటేనే సరిపోదు కచ్చితంగా నిర్మాతగా ఎంతోకొంత అభిరుచి ఉండాల్సిందే. సుధీర్ బాబు ఆ విషయంలో జాగ్రత్తపడ్డాడు. మొత్తానికి సుధీర్ జోష్ చూస్తుంటే ఇక తన సత్తా చాటేలానే ఉన్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: