కడప జిల్లా వైస్ ఫ్యామిలీ కి కంచు కోట అని చెప్పవచ్చు. ఆ జిల్లా వాసులు వైస్ ఫ్యామిలీ మీద అంతగా అభిమానం పెంచుకున్నారు. అందుకే వైసీపీ కి కూడా ఈ జిల్లా కంచుకోటగా మారింది. అధికార పార్టీ అయినా టీడీపీ ఈ జిల్లాలో పాగా వేయాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. అందుకే ఫిరాయింపులను ప్రోత్సహించి కడప లో వైసీపీ ని వీక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే లోకేష్  క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ మండ‌ల‌, గ్రామ‌స్థాయి నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని తెలిసింది.

Image result for lokesh

ఈ స‌మావేశంలో మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గంతో క‌ల‌సి ప‌నిచేసి పార్టీని బ‌లోపేతం చేయాల‌ని లోకేష్ దిశానిర్దేశం చేశార‌ని స‌మాచారం. అంతేకాదు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మెజార్టీ సాధించ‌డం ద్వారా క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానాన్ని ద‌క్కించుకోవ‌చ్చని లోకేష్ ఉత్సాహంగా చెప్పార‌ని తెలిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించామ‌ని, దీనికి మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి కార‌ణ‌మ‌ని ప్రశంసిస్తుంటే రామ‌సుబ్బా రెడ్డి వ‌ర్గీయులు భ‌రించ‌లేక‌పోయార‌ట‌.

Image result for lokesh

వారిలో ఒక గ్రామ‌స్థాయి నాయ‌కుడు లేచి సార్ ఇంగ మేము మాట్లాడేది ఇనండి అని అన్నాడ‌ట‌. అంటే నీ ప్రసంగం ఆపు అని ప‌రోక్షంగా క‌డ‌ప యాస‌లో చెప్పాడ‌మే. దీంతో ఒక్కసారిగా లోకేష్ నోరుమూసాడ‌ట‌. అప్పుడు ఆ నాయ‌కుడు మాట్లాడ‌టం మొద‌లుపెట్టినాడ‌ట‌. సార్ మీరు ఆదినారాయ‌ణ‌రెడ్డిని చేర్పిచ్చుకుని మంత్రిగా కూడా సేసినారు. మ‌మ్మల్ను ఆయ‌న‌తో క‌ల్సుకోమ‌ని సుల‌భంగా చెప్తనారు. వాళ్లూమేమూ న‌రుక్కోని, సంపుకోని జైళ్లకు స‌చ్చినాం. ఇప్పటికీ కేసుల కోసం కోర్టుల సుట్టూ తిరుగుతాండాం. ఇయ్యన్నీ మీకు మా రామ‌సుబ్బాడ‌న్నా చెప్పినా అర్థంకాలె. అని మాట్లాడే సరికే లోకేష్ ఒక్కసారి గా షాక్ అయ్యాడు. అప్పటి నుంచి క‌డ‌ప పంచాయితీ అంటే వ‌ద్దురా స్వామీ అని లోకేష్ అంతదూరం ప‌రుగెడుతున్నాడ‌ని వినికిడి.


మరింత సమాచారం తెలుసుకోండి: