మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. రాకేష్ శషి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. పక్కా సెంటిమెంట్ మూవీగా వచ్చిన ఈ సినిమా టాక్ యావరేజ్ గా ఉన్నా కలక్షన్స్ మాత్రం పెద్దగా రాబట్టడం లేదు.


మొదటి, రెండు రోజులు కలిపి 80 లక్షలు మాత్రమే వసూళు చేసిందని తెలుస్తుంది. సాయి కొర్రపాటి ఈ సినిమా కోసం 6 కోట్ల బడ్జెట్ పెట్టారట. ప్రె రిలీజ్ బిజినెస్ కూడ 7 కోట్ల దాకా జరిగిందని అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చినా కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా అవడం వల్ల అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. 


ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ లో సపోర్ట్ చేస్తున్నారు మెగా హీరోలు. ఆల్రెడీ చిరంజీవి రిలీజ్ రోజు స్పెషల్ గా సినిమా వేయించుకుని ప్రశంసించగా రాం చరణ్ కూడా బావ సినిమాపై స్పందించి వారికి విశెష్ అందించాడు. ఇక ఈరోజు రేపట్లో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి అల్లు అర్జున్ ను అతిథిగా పిలుస్తున్నారని తెలుస్తుంది. 


ఇక ఈ సినిమా వచ్చిందో లేదో కళ్యాణ్ తన రెండో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈసారి మాస్ మసాలా మూవీ.. యాక్షన్ ఫుల్డ్ సబ్జెక్ట్ తో రావాలని అనుకుంటున్నాడట. హరీష్ శంకర్ డైరక్షన్ లో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. మొత్తానికి ప్లానింగ్ లో మిగతా మెగా హీరోలతో పోటీ పడుతున్నాడు కళ్యాణ్ దేవ్.   



మరింత సమాచారం తెలుసుకోండి: