కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఆరెక్స్ 100. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా గురువారం రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తుంది. బోల్డ్ కంటెంట్ ఎక్కువైందన్న టాక్ వస్తున్నా సినిమా ఓవరాల్ గా సూపర్ సక్సెస్ అయ్యింది.


ముందునుండి సినిమాకు చేస్తున్న ప్రమోషన్స్ వల్ల సినిమా మీద యువత మనసు పడ్డారు. ఇక పాయల్ అందాలకు ఫిదా అయ్యారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు తన సత్తా చాటింది. ఫస్ట్ డే 1.45 కోట్ల కలక్షన్స్ వసూళు చేసిన ఆరెక్స్ 100 రెండో రోజు ఆ జోరు కొనసాగించింది. 


సెకండ్ డే కూడా 1.2 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. టోటల్ గా రెండు రోజుల్లోనే 3 కోట్ల షేర్ రాబట్టిందన్నమాట. సినిమా బడ్జెట్ చాలా తక్కువ కాగా పబ్లిసిటీ, ప్రమోషన్స్ అన్ని కలుపుకుని సినిమా 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వదిలారట. అంటే ఈ లెక్కన రెండు రోజుల్లోనే రావాల్సింది వచ్చేసింది.


ఇక నుండి ఆరెక్స్ 100కు వచ్చే వసూళ్లంతా లాభాలే అని తెలుస్తుంది. సినిమా రోజు రోజుకి వసూళ్లతో హంగమా సృష్టిస్తుంది. పాయల్ రాజ్ పుత్ కు ఈ దెబ్బతో మరిన్ని తెలుగు ఆఫర్స్ రావడం ఖాయమని అంటున్నారు. సినిమా విషయంలో దర్శకుడు అజయ్ భూపతి ప్రమోషనల్ స్టంట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: