మెగా హీరోలలో ఒకటి రెండు సినిమాలకే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తిక్క నుండి తేజ్ వరకూ వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అందుకున్నాడు. రిలీజ్ ముందు హంగామా బాగా ఉన్నా ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోతుంది కనీసం యావరేజ్ అయినా ప్రమోషన్స్ లో హడావిడి చేద్దాం అనుకుంటే మొదటి టాక్ తోనే నీరసపడేలా చేస్తుంది. 


తేజ్ సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో పాటుగా బిగ్ బాస్ లో కూడా కనిపించిన సాయి ధరం తేజ్ ఇప్పుడు కనుమరుగయ్యాడు. వారం పది రోజుల నుండి అతను ఎక్కడ కనిపించడం లేదు. సినిమా ఫ్లాప్ అని తెలియగానే ఎంచక్కా అమెరికాకు చెక్కేశాడని తెలుస్తుంది. అంతేకాదు ప్రస్తుతం అతని లుక్ విషయంలో కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి.


అందుకే తేజ్ సరికొత్త మేకోవర్ తో కనిపించాలని అమెరికా వెళ్లాడట. అక్కడ వర్క్ అవుట్స్ చేసి న్యూ లుక్, బాడీ షేప్ తో దర్శనమిస్తాడట. తేజ్ ఐలవ్యూ ఫ్లాప్ టాక్ రాగానే తేజూ మొహం చాటేశాడు. కథల విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సిందని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తేజూ చేతిలో కిశోర్ తిరుమల సినిమాతో పాటుగా గోపిచంద్ మలినేని సినిమాలు ఉన్నాయి.  


మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా ఓకే చేశాడు సాయి ధరం తేజ్. ఈ సినిమా కోసం స్లిమ్ గా కనిపించడానికి అమెరికా వెళ్లాడు తేజూ. ఈ సినిమా తర్వాత గోపిచంద్ సినిమా లైన్ లో ఉంది. ఆల్రెడీ గోపిచంద్ తో విన్నర్ సినిమా చేశాడు సాయి ధరం తేజ్. సుప్రీం హీరోగా క్రేజ్ తెచ్చుకున్న సాయి ధరం తేజ్ కెరియర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి వరుస ఫ్లాపులు ఎదుర్కోవడం స్టార్ రేసులో అతన్ని వెనక్కి నెట్టేసిందని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: