పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ అంటే కుర్రకారు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్నీ ఐటమ్ సాంగ్ అంటే.. నోరెళ్ల బెట్టుకుని చూసే వారు ఎంతో మంది ఉన్నారు. సన్నీ మంత్ర జపం చేసే ఎంతో మంది మగరాయుళ్లూ వున్నారు.  బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన వెబ్ సిరీస్ ‘కరణ్‌జిత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి.   టైటిల్‌ విషయంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. టైటిల్‌లో ‘కౌర్’ను అంగీకరించే ప్రసక్తే లేదని, తొలగించాలని అల్టిమేటం జారీ చేసింది. 
sunny leone
కెనడాలోని భారతీయ ఇమ్మిగ్రెంట్ దంపతులకు పుట్టిన సన్నీలియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్. సన్నీ కి 14 ఏళ్ల వయసప్పుడే పెద్దల సెక్సీ మ్యాగజైన్ కు ఫోజిలిప్పిచ్చారు తల్లిదండ్రులు.  శృంగార తారగా మారిన సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా పాపులర్ అయ్యింది. తన తల్లితండ్రులు తనను కేవలం డబ్బులు సంపాదించే అంగడి బొమ్మగానే చూస్తారని సన్నీ సన్నిహితుల వద్ద వాపోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అలాంటి సన్నీ లియోన్ జీవిత చరిత్రను యూట్యూబ్ సినిమాగా తీసుకువస్తున్నారు. కరణ్ జీత్ కౌర్ పేరుతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 16న సినిమా విడుదల కానుంది.
Image result for sunny leone biopic
కాగా, ‘కౌర్’ను ఉపయోగించడం వల్ల సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని ఎస్‌జీపీసీ అడిషనల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి దల్జీత్ సింగ్ బేడీ అన్నారు. సన్నీలియోన్ సిక్కు మత విశ్వాసాలను పాటించడం లేదని, కాబట్టి ఆ పేరును ఉపయోగించడం తగదన్నారు. అసలా పదాన్ని ఉపయోగించే హక్కే ఆమెకు లేదని కుండబద్దలుగొట్టారు.  క్కు బోధనలను పాటించని వారికి ఆ పదాన్ని ఉపయోగించుకునే అర్హత లేదన్నారు. ఈ పదాన్ని ఆమె ఉపయోగించడాన్ని సిక్కులెవరూ హర్షించరన్నారు. సన్నీలియోన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: