భారతీయ సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి.  క్రీడా, రాజకీయ, సీనీ నేపథ్యంలో బయోపిక్ సినిమాలు విపరీగంగా వస్తున్నాయి.  ఇప్పటికే స్టార్ క్రికెటర్ ధోని జీవిత ఒక సినిమా వచ్చింది.  తెలుగు లో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ సినిమా అద్భుత విజయం సాధించింది.  బాలీవుడ్ లో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ‘సంజు’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.  కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది.  అంతే కాదు మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ జరుగుతుంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు.  రాజకీయ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. 

ఇప్పుడు మరో బయోపిక్ కి ప్లాన్ చేస్తున్నారు.   ప్రముఖ తార షకీలా బయోపిక్ తెరకెక్కనుంది. శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన షకీలా తన సినిమాలతో స్టార్ హీరోల సినిమాలకు సైతం షాకిచ్చింది. షకీలా బయోపిక్‌లో ఎవరు నటిస్తారనే దానిపై చాలా తర్జన భర్జనలు పడ్డారు దర్శక నిర్మాతలు. ఓ తరుణంలో హ్యూమా ఖురేషి, స్వర భాస్కర్ పేర్లు కూడా వినిపించాయి.  షకీలా పాత్రలో రిచా చద్దా నటించనుంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ బయోపిక్ కోసం రిచా చద్దా చాలా హోంవర్క్ చేస్తుంది. 
Image result for richa chadda
ఆ పాత్ర కోసం ఆమె మళియాళం నేర్చుకుంటుంది. షకీలాను కలిసి ఆమె జీవితం గురించి తెలుసుకొని ఆ పాత్ర గురించి బాగా ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తుంది.  తంలో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘డర్టీపిక్చర్’ పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షకీలా బయోపిక్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఒకప్పుడు మలీవుడ్ లో షకీలా సినిమాలు రిలీజ్ అంటే..స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ పోన్ చేసే పరిస్థితి వచ్చేదల.  కానీ ఆమె జీవితం తర్వాత ఎన్నో కష్టాలు పడ్డట్టు..సొంత వాళ్లే తనను దారుణంగా మోసం చేసినట్లు షకీలా పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: