Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 11:02 pm IST

Menu &Sections

Search

ఆసక్తి రేపుతున్న ‘నీవెవరో’టీజర్ !

ఆసక్తి రేపుతున్న ‘నీవెవరో’టీజర్ !
ఆసక్తి రేపుతున్న ‘నీవెవరో’టీజర్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ‘వైశాలి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నటించినా పెద్దగా పేరు మాత్రం రాలేదు.  బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.  ఆ తర్వాత రంగస్థలం సినిమాలో రాంచరణ్ కి అన్నగా నటించాడు.  తాజాగా ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పోరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

హరినాథ్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందించారు. సస్పెన్ష్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ ‘మూడు నగరాలు, రెండు ప్రేమకథలు, ఒక్క సంఘటన’ అంటూ ఆది పినిశెట్టి చెప్పే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో టీజర్ మొదలైంది. ఆదికి యాక్సిడెంట్ కావడం, ‘ఇది యాక్సడెంట్ కాదు ఇట్స్ ఎ మర్డర్’ అంటూ ఒక అమ్మాయి బాధపడుతూ చెప్పడం, మరోవైపు ఆది ఫైట్స్ తో దుమ్మురేపుతున్నాడు.


అంటే ఈ సినిమాలో ఆది ద్విపాత్రాభినయం చేస్తున్నారామో అనే అనుమానం కలుగుతోంది. అందులోనూ ఒక పాత్ర అంధుడిగా చేసినట్లు అర్థమవుతోంది. ‘లవ్ ఈజ్ బ్లైండ్ నాట్ ద లవర్’ అనే క్యాప్షన్ కూడా దీనికి బలం చేకూరుస్తోంది.  ఇక కమెడియన్ వెన్నెల కిషోర్ బాగానే నవ్వులు పూయించినట్లు కనిపిస్తుంది.  ‘అర్థమైంది అర్థమైంది.. వీడిని స్కెచేసి చప్పింది అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్. కిమ్ అయినా.. ట్రంప్ అయినా లోపలేసి కుమ్ముతా’ అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 

టీజర్ చూస్తుంటే.. ఇదొక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్. ఒక మర్డర్ మిస్టరీని ఛేదించడమే హీరో లక్ష్యంగా తెలుస్తోంది. ఇంతకీ హత్యకు గురైంది ఎవరు? నిజంగా ఆది ద్విపాత్రాభినయం చేశాడా? హత్య చేసినవాడిని పట్టుకోవడమే హీరో లక్ష్యమా? తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. 


neevevaro-movie-aadhi-pinisetty-taapsee-ritika-sin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!