బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో ఐదవ వారం అందరు అనుకున్నట్టుగానే భాను శ్రీ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చేసింది. హౌజ్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్న భాను, అమిత్ చేసిన మిస్టేక్ వల్ల భాను శ్రీ ఈ వారం ఎలిమినేషన్ లో ఉంది. గణేష్, దీప్తిలతో పాటుగా భాను కూడా ఈ లిస్ట్ లో ఉంది.


ప్రతి వారం ఎలిమినేషన్ లో వారం మొత్తం హౌజ్ మేట్స్ యొక్క ప్రవర్తనను బట్టి నిర్ణయించబడుతుంది. ఆ క్రమంలో మంచి వారు.. చెడ్డ వారు టాస్క్ లో భాగంగా భాను శ్రీ, కౌశల్ మీద చేసిన అభియోగాలు ఆమెను ఎలిమినేట్ చేశాయి. టాస్కులో భాగంగా కాస్త చనువు తీసుకున్న కౌశల్ ను భాను శ్రీ అనరాని మాటలు దూషించింది.   


అయితే ఆమెతో పాటుగా తేజశ్వి కూడా కౌశల్ ను టార్గెట్ చేస్తూ మాటలు అనడం తెలిసిందే. అందుకే శనివారం నాడు తేజశ్వికి నాని స్పెషల్ గా క్లాస్ పీకాడు. మొదటి నుండి కౌశల్ మీద నెగటివ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టే ఇలా అతన్ని దూషించారని నాని అన్నాడు. ఫైనల్ గా ఈ వారం భాను ఎలిమినేషన్ కు కారణం టాస్కులో ఆమె మాట్లాడిన తీరు అని చెప్పొచ్చు.


అమిత్ ఒకవేళ ఆమెను నామినేషన్ చేసి ఉండకపోతే ఈ వారం గణేష్, దీప్తిలలో ఒకరు ఎలిమినేట్ అయ్యుండే వారు. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న భాను ఫైనల్ గా హౌజ్ నుండి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వెళ్లేప్పుడు బిగ్ బాస్ ఇచ్చే బిగ్ బాంబ్ అమిత్, కౌశల్ కు ఇచ్చి హౌజ్ నుండి బయటకు వచ్చింది భాను శ్రీ.   



మరింత సమాచారం తెలుసుకోండి: