గతవారం విడుదల అయిన కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాను కలెక్షన్స్ పరంగా నిలపెడదామని మెగా కాంపౌండ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆ మూవీ ఏమాత్రం తేరుకోలేక పోతోంది. దాదాపు 10కోట్ల ఖర్చుతో తీసిన ఈ సినిమాకు నిన్నటితో పూర్తి అయిన వీక్ ఎండ్ తో కనీసం కోటి రూపాయల నెట్ కలక్షన్స్ కూడ రాలేదు అన్న ప్రచారం జరుగుతోంది. 
ALLU ARJUN AT VIJETHA MOVIE SUCCESS MEET PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా ఈమూవీ సక్సస్ మీట్ ను నిర్వహించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ కళ్యాణ్ దేవ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇదే సందర్భంలో ఎవరూ ఊహించని విధంగా ఈసినిమా నిర్మించిన నిర్మాత కొర్రపాటి సాయికి కళ్యాణ్ దేవ్ వల్ల వచ్చిన నష్టాలకు ఒక పరిష్కార మార్గం ఊహాత్మకంగా చెప్పాడు. 

సాధారణంగా బన్నీ ఎవరికీ మాట ఇవ్వడు కానీ ఇస్తే మాత్రం నిలబెట్టుకుంటాడు అన్న పేరు ఉంది. ఎప్పుడో అన్నమాట మేరకు లగడపాటి శ్రీధర్ ను పిలిచి ఒక సినిమాను చేసిన విషయం తెలిసిందే.   అలాగే నల్లమలుపు బుజ్జికి ఇచ్చిన మాట కోసం ఇప్పుడు సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగ ‘విజేత’ సినిమాతో ఘోరంగా నష్టపోయిన నిర్మాత కొర్రపాటి సాయి సరైన సబ్జెక్ట్ ను తెస్తే ఆ బ్యానర్ లో సినిమా చేస్తాను అంటూ కళ్యాణ్ దేవ్ వల్ల కొర్రపాటి సాయికి వచ్చిన నష్టాలను తీర్చే పనికి శ్రీకారం చుట్టాడు. 
Vijetha-Successmeet-Pics (3)
వాస్తవానికి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు గాంచిన కొర్రపాటి సాయి గత కొంత కాలంగా తీవ్ర నష్టాలతో సతమతున్న విషయం తెలిసిందే. ‘ఈగ’  ‘లెజెండ్’ లాంటి భారీ హిట్ సినిమాలు తీసిన ఈ నిర్మాత తీసిన ‘తుంగభద్ర’ ‘మనసంతా’ ‘పటేల్ సార్’ ‘యుద్ధంశరణం’ లాంటి ఫ్లాప్ సినిమాలు తీసి ఆ నష్టాలు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ ద్వారా తీర్చుకుందామని ప్రయత్నిస్తే ఆమూవీ కూడ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఇలా వ్యూహాత్మకంగా బన్నీ కొర్రపాటి సాయికి సహాయపడుతున్నాడనుకోవాలి. అన్నీ కుదిరి మంచి సినిమాను బన్నీ తో కొర్రపాటి తీయగలిగితే కొర్రపాటి సమస్యలకు బన్నీ రూపంలో పరిష్కారం దొరికింది అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: