స్వీటీ అనుష్క సెలెక్టెడ్ సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే. భాగమతి తర్వాత తమిళంలో ఒక సినిమా కన్ఫాం చేసిన అనుష్క తెలుగులో మరో సినిమా ఏది ఫైనల్ చేయలేదు. దర్శకులు కథలు చెబుతున్నా అనుష్క ఎందుకో ఒప్పుకోవట్లేదని టాక్. అయితే లేటెస్ట్ గా చంద్రశేఖర్ యేలేటి అనుష్కకు ఓ కథ నేరేట్ చేశారట.


అనుష్కకు కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో అనుష్కతో పాటుగా నాచురల్ స్టార్ నాని కూడా నటిస్తున్నాడని అంటున్నారు. నాని, అనుష్క క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే ఇక ఆ లెక్క వేరేలా ఉంటుంది. 


మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చంద్రశేఖర్ యేలేటి ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించేలా చూస్తున్నారట. అసలైతే ఈ సినిమాలో ముందు మెగా హీరో సాయి ధరం తేజ్, నితిన్ లు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా నాని దగ్గరకు ఈ కథ వచ్చింది. 


ఇప్పటికే నాని, నాగార్జునతో దేవదాస్ గా మల్టీస్టారర్ తో వస్తున్నాడు. మరో పక్క శర్వానంద్ తో మరో మల్టీస్టారర్ కు సైన్ చేశాడు. అనుష్కతో అది కూడా ఎక్స్ పెరిమెంట్ మూవీ అంటున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. అనుష్కతో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నాని ఈ మూవీపై చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: