తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు.  చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో పవన్ కళ్యాన్.  ఆ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ అని చెప్పొచ్చు.  ఈ మద్య వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా..పెద్దగా కలిసి రావడం లేదు.  ఇక ‘విజేత’చిత్రంతో కళ్యాన్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘విజేత’ మంచి ప్రేక్షకాదరణను తెచ్చుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం విజయోత్సవ వేడుకను హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.  ఈ సందర్బంగా బన్ని మాట్లాడుతూ..విజేత చాలా సెంటిమెంట్ తో కూడుకున్న చిత్రం అని..తండ్రి కొడుకుల మద్య వచ్చే ఎమోషన్స్ మనసుకు హత్తుకున్నాయని..ఈ చిత్రంలో కల్యాణ్ చాలా బాగా నటించారని, క్లైమాక్స్  బాగుందని చెప్పాడు. అలాగే, నటుడు మురళీశర్మ కూడా అద్భుతంగా నటించారని అన్నారు.
Image result for vijetha movie
ఇదిలా ఉంటే..ఈ చిత్రంలోని ‘కో..కొక్కొరోకో..’ పాట గురించి ప్రస్తావిస్తూ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ‘కల్యాణ్ మా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందని నాకు పంపాడు.  ఆ మద్య నేను ఊరిళ్లాను..ఊరు నుంచి వచ్చాక ఓ రోజున మా ఏడాదిన్నర పాప కారు డెక్ మీద కొడుతూ ‘కొకొ..’ అంటోంది. మా కూతురు కొకొ అంటుంటే నాకు అర్థం కాలేదు..వెంటనే నా భార్యను అడిగాను పాప ఎమంటుందీ అని కల్యాణ్ సినిమా వచ్చింది కదా, అందులోని పాట ‘కొక్కొరోకో’ పాట పెట్టమని అంటోంది’ అని చెప్పింది. మా అబ్బాయికి కూడా ఆ పాట అంటే చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: