అత్యంత భారీ అంచనాలతో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అరవింద సమేత’ పై రోజురోజుకు పాజిటివ్ టాక్ పెరుగుతోంది. ఈనూవీ బిజినెస్ కూడ చాల భారీ స్థాయిలో జరుగుతోంది. అయితే ఆశ్చర్యకరంగా ఈసినిమాను టార్గెట్ చేస్తూ హీరో రామ్ హీరో విశాల్ తీసుకున్న నిర్ణయం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 
haarika & hassine creations released aravindha sametha motion poster on jr ntr birthday
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత కాస్త చెప్పుకోదగ్గ సీజన్ దసరా మాత్రమే. సాధారణంగా ఈ సీజన్ కు ఇద్దరు పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీ ఉంటుంది. దీనికి భిన్నంగా జూనియర్ ‘అరవింద సమేత’ ను కార్నర్ చేస్తూ రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’ విశాల్ ‘పందెం కోడి 2’ విడుదల చేస్తూ ఉండటం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. 
Amazing Pics Of Ram Pothineni
వాస్తవానికి ‘అరవింద సమేత వీర రాఘవ’ అత్యంత భారీ స్థాయిలో ధియేటర్లు దొరుకుతాయి. ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే రామ్ విశాల్ ల సినిమాలకు ధియేటర్లు కూడ దొరకని పరిస్థితి.  ఇప్పటికే ‘అరవింద సమేత’ కు 100 కోట్ల బిజినెస్ జరుగుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో విశాల్ రామ్ లు తమ సినిమాలతో జూనియర్ తో ఢి కొట్టడం వెనుక ఎదో ఒక వ్యూహం ఉంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
Vishal Is A Real Hero!
రామ్ ‘హలో గురు ప్రేమ కోసం’ వెనుక దిల్ రాజు ఉండటంతో పాటు ‘అభిమన్యుడు’ తో తన కం బ్యాక్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన విశాల్ ‘పందెం కోడి 2’ పై అంచనాలు పెంచుతున్నాయి. గత కొంతకాలంగా టాప్ హీరోల సినిమాలకు ఊహించని పరాజయాలు వస్తున్న నేపధ్యంలో జూనియర్ ‘అరవింద సమేత’ గురించి ఎదో ఒక విషయం లీక్ అవ్వడంతో రామ్ విశాల్ లు ఇలాంటి సాహసం చేస్తున్నారు అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: