ఈ మాటలు అంటుంది ఎవరో కాదు బాలీవుడ్ హీరో సైయిఫ్ అలీఖాన్.  బాలీవుడ్ నటుడు, నజఫ్‌గఢ్ నవాబ్ సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ‘భారత్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చావడం ఖాయం. ఎవరో ఒకరు చంపేస్తారు’ అని వ్యాఖ్యానించారు. తొలి నెట్‌ఫ్లిక్స్ షో ‘సేక్రెడ్ గేమ్స్’ ఈనెల 6 న స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పోలీస్ అధికారి సర్తాజ్ సింగ్ పాత్రను సైఫ్ పోషించారు.  ప్రస్తుతం లండన్ లో ఉన్న సైఫ్ అలీఖాన్ భారత చట్టాన్ని గురించి ప్రస్తావించారు.   
sair ali khan l second games కోసం చిత్ర ఫలితం
మన కులం కాని వారితో డేటింగ్ చేసినా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చంపేయడం ఖాయమని సైఫ్ అలీఖాన్ అన్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన, ఇతరులతో పోల్చుకుంటే భారత్‌లో నిర్భందంతో కూడిన స్వేచ్ఛ ఉంది.. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏమవుతుందో తెలియదు, ఎవరో ఒకరు హతమారుస్తారని అన్నారు.  కాగా, సైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సేక్రెడ్ గేమ్స్’పై తొలి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందులో మితిమీరిన శృంగారం, హింస, అభ్యంతరకరమైన భాషలో పదప్రయోగం లాంటివి ఇందులో ఉపయోగించారు. ముఖ్యంగా దేశంలోని రాజకీయాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఇందులో ఉన్నాయి. ఈ షోలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చూపిన విధానంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కోర్టుకెక్కింది.  ఈ నేపథ్యంలో  రాహుల్ గాంధీ ఇటీవల ఓ ట్వీట్ చేస్తూ తన తండ్రి దేశం కోసం జీవించి, సేవ చేస్తూ ప్రాణాలొదిలారు.. సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌ కల్పిత పాత్రలు అభిప్రాయాలను ఎప్పటికీ మార్చలేవు’ అని ఈ షో చిత్రీకరణ బృందంపై విమర్శలు గుప్పించారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: