తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’చిత్రం అనుకున్నదానికన్నా రెట్టింపు సక్సెస్ అయ్యింది.  మొదట్లో ఈ చిత్రంపై ఎన్నో అనుమానాలు వచ్చినా..వాటన్నింటికి చెక్ పెడుతూ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని మంచి కలెక్షన్లు సాధించింది.  ఈ చిత్రంలో మహానటి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.  దాంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్.
Image result for ntr biopic
దర్శకుడు క్రిష్ నటరత్న ఎన్టీఆర్ జీవితకథను తెరకెక్కించబోతున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్ లో టాకీ పార్ట్ పూర్తి కానుంది.  ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాత్రను తీసుకుంటూ వాటికి సంబంధించిన అప్ డేట్ ఇస్తున్నారు.  రీసెంట్ గా ప్రకాశ్ రాజ్, నరేష్ లను తీసుకున్నట్లు తెలుస్తుంది. 
Related image
  తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును ఎంపిక చేశారు.   
Image result for keerthi suresh mahanati
బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: