ప్రస్తుతరం టాప్ దర్శకులను షేక్ చేస్తూ సక్సస్ కి కొత్త అర్థం చెబుతున్న దర్శకుడు అజయ్ భూపతి స్టార్ హీరోలు లేకుండా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టకుండా ఒక చిన్న సినిమాతో ఈయంగ్ డైరెక్టర్ సాధించిన విజయం ఈ ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తోంది. గత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ తో సందీప్ రెడ్డి సంచలనదర్శకుడి గా మారితే అతడి స్థానాన్ని అజయ్ భూపతి ఓవర్ టేక్ చేస్తున్నాడు. 
RX 100 Movie New Still
గత మూడు రోజులుగా ఇతని ఫోన్ ఇండస్ట్రీ వర్గాల ప్రముఖుల నుండి అందుతున్న నాన్ స్టాప్ ఇన్ కమింగ్ తో మోగిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు అనేకమంది ప్రముఖ నిర్మాతలు తమ బ్యానర్ లో సినిమాను చేయడానికి కు అడ్వాన్స్ లు తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారు అంటే ఈయంగ్ డైరెక్టర్ రేంజ్ ఒకేసారి ఎలా పెరిగి పోయిందో అర్ధం అవుతుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ స్థాయిని దాటిపోయినా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. 
RX100
అయితే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈమూవీ విజయం మహేష్ బావ సుదీర్ బాబుకు దురదృష్టంగా మారింది అని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సబ్జెక్ట్ పట్టుకుని హీరో సుధీర్ బాబు చుట్టూ దాదాపు మూడు నాలుగు నెలలు తిరిగినట్లు తెలుస్తోంది.  ఈమూవీ  కథ సుధీర్ బాబుకు బాగా నచ్చినా ఎన్నిరోజులు గడిచినా తన నిర్ణయం చెప్పకుండా ఆలస్యం చేస్తూ ఉండటంతో ఇక లాభం లేదు అనుకుని కొత్త హీరో కార్తికేయతో ఈసినిమాను తీసినట్లు తెలుస్తోంది.
RX100
తను పుట్టి పెరిగిన ఈస్ట్ గోదావరి ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లోనే ఈమూవీ షూటింగ్ పూర్తి చేసి  కేవలం రెండున్నర కోట్ల రేంజ్ లో ఫినిష్ చేసి ఈసినిమాకు పెట్టిన ఖర్చు కేవలం రెండు రోజులలో తిరిగి వచ్చిన నేపధ్యంలో ఈమూవీని ధైర్యం చేసి కొనుకున్న బయ్యర్లకు ఏ రేంజ్ లో లాభాలు వస్తాయి ఊహకు కూడ అందడం లేదు అంటున్నారు. ఏది ఏమైనా సుధీర్ బాబు తన తలుపు  తట్టిన అదృష్టాన్ని గుర్తించడంలో విఫలం అయ్యాడు అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: