బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టి హీరో రేంజ్ కి ఎదిగాడు  ఇర్ఫాన్ ఖాన్.  ఇర్ఫాన్ ఖాన్ వయసు ఇప్పుడు 51 సంవత్సరాలు. పీకూ, మక్బూల్, హాసిల్, పాన్ సింగ్ తోమార్ వంటి బాలీవుడ్ హిట్ సినిమాలు సహా 100కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో మహేశ్‌బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో ఇర్ఫాన్ విలన్ పాత్ర పోషించారు. భారతదేశంలో మంచి పేరున్న అంతర్జాతీయ నటుడు ఇర్ఫాన్ ఖాన్. లైఫ్ ఆఫ్ పై, స్లమ్‌డాగ్ మిలియనీర్, అమేజింగ్ స్పైడర్-మాన్ వంటి ఇంగ్లిష్ సినిమాల్లోనూ ఆయన నటించారు. 

ఇర్ఫాన్ ఖాన్  కొన్నాళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. న్యూరోఎండ్రోసిన్ అనే నరాల సంబంధిత వ్యాధికి చికిత్స కోసం లండన్ వెళ్లి.. దాదాపు అజ్ఞాతంలో వున్నాడు. తన ఆరోగ్య పరిస్థితిపై గోప్యత పాటించడంతో.. అన్ని వర్గాల్లోనూ ఆవేదన, ఆసక్తి పెరిగింది.  తాజాగా ఇర్ఫాన్ ఖాన్ తన అభిమానులకు ఓ సందేశం పంపాడు. తన లేటెస్ట్ పిక్ నొకదానిని ఇర్ఫాన్ రివీల్ చేశాడు.జబ్బు పీడితుడిగా అతడి శరీరం ఎంత బాధాకరంగా వున్నా.. ముఖంలో మాత్రం నవ్వు ఛాయలు చెక్కుచెదరకుండా అతడిచ్చిన ఫోటో స్టిల్.. ఫ్యాన్స్‌కి ఓ వైపు బాధగా ఉన్నా..మరోవైపు సంతోషం కలిగించింది.

ఎప్పుడూ తన నటనతో సగటు ప్రేక్షకుడ్ని ఆనందపరిచే ఇర్ఫాన్.. తన అనారోగ్య సమస్యను మరుగుపరిచి అదే జోష్‌ని కనబరచడం అతడికి మాత్రమే చెల్లింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.  త్వరగా ఆరోగ్యం బాగు చేసుకొని మళ్లీ వెండితెరపై కనిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: