తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు.  కానీ కమర్షియల్ గా మంచి కలెక్షన్లు సాధించిందని అంటున్నారు.  తెలుగు లో కాలా సక్సెస్ కాలేదు సరికదా కలెక్షన్లు కూడా దారుణంగా వచ్చాయి.  దాంతో బయ్యర్లు పెద్ద గొడవ చేయగా నిర్మాత, రజినీ వారికి సెటిల్ మెంట్ చేసినట్లు వార్తలు వినిపించాయి.  ఇదిలా ఉంటే తాజాగా రజినీకాంత్ సన్ పిక్చర్స్ బ్యానర్లో రజనీకాంత్ ఒక సినిమా చేస్తున్నారు. 
Image result for rajinikanth vijay sethupathi
విభిన్నమైన కథాకథనాలతో కూడిన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా కొంతభాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కార్తీక్ సుబ్బరాజు .. విజయ్ సేతుపతిని తీసుకున్నాడు. తాజాగా ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రకి గాను మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ను కార్తీక్ సుబ్బరాజు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 

మాలీవుడ్ లో ఫాహద్ ఫాజిల్ కి మంచి క్రేజ్ ఉంది. ఫాహద్ ఫాజిల్ అక్కడ సహజ నటుడు అని అంటారు.  ఈ సినిమాలోని ఒక పాత్రను ఆయనతో చేయిస్తేనే బాగుంటుందని భావించి తీసుకున్నారట. అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో సిమ్రాన్ .. కాజల్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: