సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ రచనా, దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను'. 2018 సంవత్సరం వచ్చిన సినిమాలలో పెద్ద హిట్టు కొట్టిన చిత్రం ఏమిటంటే ప్రస్తుతానికి భరత్ అనే నేను అనే చెప్పుకోవాలి. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ చిత్రం ఆయనకు ఒక మంచి పేరు తెచ్చి సంచలన విజయం సాధించింది. భారీ సెట్టింగులతో మంచి కథాంశంతో గొప్ప సీనియర్ నటులతో తీసిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించైనా సంగతి తెలిసిందే. కానీ సినిమాకు సంబందించి కొద్దిరోజులుగా కొన్ని నమ్మలేని పుకార్లు చిత్రసీమలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం పని చేసిన కొందరు ఆర్టిస్టులకి దానయ్య రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు వెలువడ్డాయి.

Image result for bharath ane nenu

కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీలకు ఆయన పూర్తి రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు సినిమా అని చెప్పి సినిమాలో వాడుకున్నారు తప్ప సినిమాకు సంబంధించి కొందరు ఆర్టిస్టులకు ఏమాత్రం రెమ్యునరేషన్ చెల్లించలేదన్న అపోహలు రావడంతో మనస్థాపానికి గురైన దానయ్య  తాజాగా దాన‌య్య ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Image result for bharath ane nenu

`మా నిర్మాణ సంస్థ మీద వ‌చ్చిన నిరాధార‌మైన ఆరోప‌ణలు మ‌మ్మ‌ల్ని ఎంతో బాధించాయి. `భ‌ర‌త్ అనే నేను`లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రానికి ప‌నిచేసినందుకు మేము, మా టీమ్ అంతా ఎంతో గ‌ర్వ‌ప‌డుతుంటాం. అంత మంది నటీ నటులు రాత్రి పగలు ఆలోచించకుండా కష్టపడి సినిమాకోసం పనిచేసారు. అలాంటి వారికి మేము ఎందుకు మోసం చేస్తాం. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం ప‌నిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రికీ అణా పైసలతో సహా పారితోషికాలు చెల్లించాం.


ఈ విష‌యంలో ఎవ‌రికైనా అనుమానాలు ఉంటే హైద‌రాబాద్‌లోని మా కార్యాల‌యానికి గాని, మా సినిమాలో ప‌నిచేసిన న‌టీన‌టుల‌ను గాని సంప్ర‌దించ‌వ‌చ్చు. ఇక‌పై ఇలాంటి ఊహాజ‌నిత వార్త‌లు ప్ర‌చురించ‌వ‌ద్ద‌ని జ‌ర్న‌లిస్టుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌`ని దాన‌య్య ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పూర్తి సమాచారం లేకుండా ఇలా నిర్మాతలను మీడియా ముందుకు లాగి మా పరువు తీయడం సమంజసం కాదని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: