తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎంతో క్రేజ్ ఉంది.   మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.    రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఈ చిత్రం పెద్దగా పేరు తీసుకు రాలేక పోయింది.  ఆ తర్వాత దేశముదురు, ఆర్య, బన్ని చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్.  డ్యాన్స్, ఫైట్స్ లో మామకు తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నాడు.  అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ చిత్రం భారతీయ సినీ చరిత్రలో  ఓ క్రేజీ రికార్డు క్రియేట్ చేసింది. 
Image result for sarrainodu movie
బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ మొదట యావరేజ్ టాక్ వచ్చినా..ఒక్క వారంలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.  సాధారంగా తెలుగు చిత్రాలు బాలీవుడ్ లో రిమేక్ కాకుండా యూట్యూబ్ లో డబ్బింగ్ చేస్తుంటారు.  అలాంటి చిత్రాల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ చిత్రాలకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. 

తాజాగా ‘సరైనోడు’ హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లో రెండు కోట్లమందికిపైగా వీక్షించారు. యూట్యూబ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ‘సరైనోడు’ కావడం విశేషం. ఈ చిత్ర హిందీ వెర్షన్‌ యూట్యూబ్‌ హక్కులను గోల్డ్‌మైన్స్‌ టెలీఫిల్మ్స్‌ దక్కించుకుంది. ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని 200,635,52మంది వీక్షించగా, ఆరు లక్షలమందికి పైగా లైక్‌ చేశారు.
Image result for sarrainodu movie
రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌, ఆది పినిశెట్టి, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.127కోట్లు వసూలు చేసింది. పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ యాంగ్రీమెన్‌గా గణ అనే పాత్రలో కనిపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: