ఈ మద్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ బ్యూటీల హవా బాగా పెరిగిపోయింది.  రకూల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డె లాంటి హీరోయిన్లు జోరు కొనసాగిస్తున్నారు.  ఇక బాలీవుడ్ లో `హౌస్ ఫుల్` సిరీస్ లో ఇప్పటివరకు మూడు బ్లాక్ బస్టర్ హిట్ లు వచ్చిన సంగతి తెలిసిందే.  ప్రముఖ కొరియోగ్రాఫర్ - దర్శకురాలు ఫరాహ్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 
Related image
ఆ మద్య మహేష్ బాబు సరసన నటించిన  కృతి సనన్, రాంచరణ్ కి అక్కగా నటించిన  కృతి కర్బందా, అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డేలు  చాలా హాట్ హాట్ గా బ్లాక్ డ్రెస్ లో ఫొటోలకు పోజులిచ్చారు. ఫరాహ్ తో కలిసి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు దిగిన బ్లాక్ థీమ్ హాట్ ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Image result for Housefull 4 movie
`హౌస్ ఫుల్ -4`లో ప్రేక్షకులను మరోసారి భారీగా గ్లామర్ డోస్ తో అలరించేందుకు సాజిద్ రెడీ అయినట్లు కనిపిస్తోంది.ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ లో అక్షయ్ కుమార - రితీష్ దేశ్ ముఖ్ - బాబీ డియోల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. `హౌస్ ఫుల్ -3`లో సందడి చేసిన అర్జున్ రాంపాల్ స్థానంలో బాబీ డియోల్ ను తీసుకున్నారు.
Image result for Housefull 4 movie
కాగా, రితీష్ ను ముద్దాడుతున్న ఫరాహ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. `చాలా రోజుల తర్వాత నా డార్లింగ్ రితీష్ తో షూటింగ్ జరుపుతున్నాను` అంటూ ఫరాహ్ పోస్ట్ చేశారు. దీపావళి కానుకగా `హౌస్ ఫుల్ -4`ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సాజిద్ ప్లాన్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: