కోలీవుడ్ హీరో కార్తీకి తన ఇమేజ్ తో పాటు తన మార్కెట్ కూడ టాలీవుడ్ లో పెంచుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. కష్టపడి తెలుగు నేర్చుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని కార్తి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఈ తమిళ హీరోకు తాను కోరుకున్న హిట్ తెలుగులో రావడం లేదు.

ఈపరిస్తుతులలో కార్తి తన లేటెస్ట్ మూవీ ‘చినబాబు’ ద్వారా మరో ప్రయత్నం చేసి ఆసినిమా టాక్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఆమూవీని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో నిన్న కార్తికి హైదరాబాద్ ట్రాఫిక్ లో ఊహించని అనుభవం ఎదురు కావడంతో తాను ప్రయాణిస్తున్న ఖరీదైన కారును వదిలి ఆటోలో సామాన్యుడుగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
Chinababu teaser Review
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే నిన్న కార్తి తన సినిమాను ప్రమోట్ చేస్తూ హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ తన మూవీ ప్రమోషన్ పూర్తి చేసుకుని జూబ్లీ హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేయబడ్డ ‘చినబాబు’ సక్సస్ మీట్ కు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసాడు.
hero karthi speech at chinababu press meet
అయితే అప్పటికే సాయంత్రం కావడంతో మాదాపూర్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ లో తన కారు చిక్కుకోవడంతో ఇక లాభం లేదనుకుని తన కారు వదిలి ఈమూవీ నిర్మాత రవీంద్ర రెడ్డితో కలిసి చాల కష్టపడి సమయానికి ‘చినబాబు’ సక్సస్ మీట్ కు కార్తి ఆటోలో రావడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. కార్తీ ఆటోలో ప్రయాణిస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. టాప్ హీరోల సినిమా ఫంక్షన్స్ కోసం గంటల సేపు మీడియా ప్రతినిధులను వెయిట్ చేయించే సంస్కృతికి భిన్నంగా కార్తీ ఇలా తన గురించి వేచి ఉన్న అతిధుల కోసం మీడియా ప్రతినిధుల కోసం ఆటోలో ప్రయాణించి రావడం మీడియా వర్గాలను ఆశ్చర్య పరిచినట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: