ప్రముఖ రచయిత కోన వెంకట్ పవన్ వీరాభిమాని మాత్రమే కాకుండా పవన్ తో అత్యంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులలో తాను ఒకడిని తనకు తానే చెప్పుకుంటూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం తన జీవిత ధ్యేయం అని చెప్పుకునే కోన వెంకట్ ఆ అవకాశం గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. 
Neevevaro movie teaser
విలక్షణ రచయితగా పేరు గాంచిన కోన వెంకట్ స్క్రిప్ట్ అందించిన ‘నీవెవరో’ సినిమాలో ఆది  పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. రితిక సింగ్, తాప్సి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈమూవీకి సంబంధించిన టీజర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈమూవీ పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి పెరుగుతోంది. 
Kona-Venkat
రివేంజ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా తీయబడుతున్న ఈసినిమాను గురించి వివరిస్తూ కోన వెంకట్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ సెట్ చేసుకున్న గోల్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు కోన వెంకట్ సమాధానం ఇస్తూ ఈ కామెంట్స్ చేసాడు.
Pawan Kalyan
ఈమధ్య తాను పవన్ ను కలిసాను అని చెపుతూ తాను సెట్ చేసుకున్న గోల్ చేరుకున్నాక తప్పకుండా సినిమాలు గురించి ఆలోచిస్తాను అంటూ పవన్ చేసిన కామెంట్ ను బయటపెట్టాడు కోన వెంకట్ దీనినిబట్టి చూస్తుంటే పవన్ తనకు తానుగా సెట్ చేసుకున్న ముఖ్యమంత్రి పదవిని అందుకోలేకపోతే తిరిగి సినిమాలలోకి వస్తాను అన్న అర్ధాలు వచ్చేడట్లు పవన్ ఉద్దేశాలు ఉన్నాయని కోన వెంకట్ మాటలు బట్టి తెలుస్తోంది అని అనుకోవాలి. 9 సంవత్సరాలు తరువాత చిరంజీవి సినిమాలలో నటిస్తే ఆదరించినట్లుగా తనను కూడ తన అభిమానులు ఎన్ని సంవత్సరాలు అయినా ఆదరిస్తారు అన్న నమ్మకమే పవన్ చేత రాజకీయాలలో ఇలాంటి ప్రయోగాలు చేయిస్తోంది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: