ఈ మద్య భారతీయ చలన చిత్ర రంగంలో బయోపిక్ లకు పెద్ద పీట వేస్తున్నారు.  అయితే ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ లు వచ్చాయి కానీ సినీ తారలపై రాలేదు.   కాగా తెలుగు లో నాగ్ అశ్వన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. 
Related image
ఇక బాలీవుడ్ లో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ‘సంజు’ చిత్రాన్ని తెరకెక్కించారు..ఈ చిత్రం అద్భతమైన విజయం సాధించడమే కాదు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.  గతంలో పద్మావత్ చిత్రం సాధించిన రికార్డు తిరగరాసింది.  రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తోంది.
Image result for padmavat
ఆదివారం రూ.9.29 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా రూ.316.64 కోట్లతో బాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది.  అంతే కాదు ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ‘పద్మావతి’ని వెనక్కి నెట్టేసింది. అంతేకాదు, రణ్‌బీర్ కపూర్ 11 ఏళ్ల కెరియర్‌లో రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగానూ ‘సంజు’ రికార్డులకెక్కింది'



మరింత సమాచారం తెలుసుకోండి: